ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్ర సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఆసక్తికమైన పోస్టులు చేస్తుంటారని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆనంద్ మహింద్ర మరో వీడియోను షేర్ చేశారు. ఓ మహళ టీ షర్ట్ ను సులభంగా, వేగంగా ఓ టీ షర్ట్ ను మడత పెట్టిన వీడియోను పోస్టు చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోను ఆయన ట్విట్టర్ లో షేర్ చేయగా ఆ వీడియోను ఏకంగా 1.8 కోట్ల మంది వీక్షించారు. అయితే ఈ వీడియోలో ఓ మహిళ ఒక టీ షర్ట్ పై 1,2,3 అని రాసి ఉన్న చిన్న కార్డులను ఈ టీషర్ట పై పెడుతుంది. ఆ తర్వాత వాటిని తీసేసి క్షణాల్లోనే టీషర్ట్ ను మడతబెడుతుంది.
ఈ వీడియోపై ఆనంద్ మహింద్ర క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది ప్రపంచాన్ని మార్చే విషయం కాకున్న సృజనాత్మకతతో కూడుకున్న పని అని తెలిపారు. పనుల్లో సమయాన్ని ఆదా చేసే ప్రతీది పురోగమిస్తోందంటూ రాసుకొచ్చారు. మహీంద్రాతో ఏకీభవించిన ట్విట్టర్ వినియోగదారులు ఆ మహిళ టెక్నిక్ తో టీ షర్ట్ మడతపెట్టడంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. అద్భుతమైన క్రియేటివిటీ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, వీడియోలో ఇది సులభంగా కనిపించినప్పటికీ.. ప్రాక్టికల్‌గా చేయడం అంత సులభం కాదని మరో యూజర్ కామెంట్ చేశారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
I can’t resist being fascinated by this kind of seemingly trivial stuff. May not change the world, but it’s so creative & right-brained. Everything that saves time on mundane chores is progress! ? pic.twitter.com/tEPqXtjNsZ
— anand mahindra (@anandmahindra) April 5, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..