Viral: పాలు పోయగానే కళ్లు తెరిచిన శవం.. అంతే కాకుండా.. దెబ్బకు అక్కడున్న వారి ఫ్యూజులు ఔట్..

చనిపోయిన వారు మళ్లీ రారు. రాలేరు కూడా.. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అయితే.. వారి తాలూకూ జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. దీంతో వారు మనతో మాట్లాడుతున్నట్లు, మనల్ని పిలుస్తున్నట్లు,..

Viral: పాలు పోయగానే కళ్లు తెరిచిన శవం.. అంతే కాకుండా.. దెబ్బకు అక్కడున్న వారి ఫ్యూజులు ఔట్..
Guntur Tapasvi Murder Case

Updated on: Dec 17, 2022 | 1:24 PM

చనిపోయిన వారు మళ్లీ రారు. రాలేరు కూడా.. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. అయితే.. వారి తాలూకూ జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. దీంతో వారు మనతో మాట్లాడుతున్నట్లు, మనల్ని పిలుస్తున్నట్లు, చూస్తున్నట్లు భ్రమ కలుగుతుంటుంది. అయితే.. తమిళనాడులో ఇప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి తెలిస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. చనిపోయాడనుకున్న వ్యక్తి.. అంతిమ సంస్కారాలు చేస్తున్న సమయంలో దిగ్గున లేచి కూర్చున్నాడు. దీంతో అక్కడున్న వారంతా బిత్తరపోయారు. మృతదేహం నోట్లో పాలు పోసిన వెంటనే అతను లేచి కూర్చోవడం గమనార్హం. తమిళనాడులోని పుదుకోట జిల్లా ఆలంపట్టి మురండాంపట్టి గ్రామానికి చెందిన రైతు షణ్ముగం.. గుండె, కాలేయ సమస్యలతో బాధ పడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు పొన్నమరావతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. షణ్ముగాన్ని పరిశీలించిన వైద్యులు.. చికిత్స అందించారు. అయినా షణ్ముగం కోలుకోలేదు. ట్రీట్ మెంట్ తీసుకుంటూనే చనిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరమున్నీరయ్యారు.

అంత్యక్రియలు నిర్వహించేందుకు షణ్ముగం మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు స్వగ్రామానికి తీసుకెళ్లారు. అంతిమ సంస్కారంలో భాగంగా షణ్ముగం కుమారుడు తమ సంప్రదాయం ప్రకారం కడసారిగా తండ్రి భౌతికకాయం నోట్లో పాలు పోశాడు. అంతే! ఒక్కసారిగా దగ్గుతూ షణ్ముగం కళ్లు తెరిచాడు. దాంతో చుట్టూ ఉన్న బంధువులంతా బెంబేలెత్తిపోయారు. షణ్ముగం మాత్రం ‘ఏం జరిగింది?’ అంటూ లేచి నిలుచున్నాడు. ఆ తర్వాత అతనికి జరిగిందంతా చెప్పారు. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో వారు ఆనందంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం