Draupadi Murmu: కొత్త రాష్ట్రపతికి క్రియేటివ్‌గా వెల్‌కమ్‌ చెప్పిన అమూల్‌.. ట్రెండింగ్‌లో ద్రౌపది ముర్ము డూడుల్‌

|

Jul 25, 2022 | 2:04 PM

Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం (జులై25) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్టీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె జులై 21న నిర్వహించిన ఎన్నికల్లో విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. తద్వారా దేశ అత్యున్నత పీఠాన్ని అవరోధించనున్న మొట్టమొదటి గిరిజన మహిళగా..

Draupadi Murmu: కొత్త రాష్ట్రపతికి క్రియేటివ్‌గా వెల్‌కమ్‌ చెప్పిన అమూల్‌.. ట్రెండింగ్‌లో ద్రౌపది ముర్ము డూడుల్‌
Droupadi Murmu
Follow us on

Draupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం (జులై25) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్టీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె జులై 21న నిర్వహించిన ఎన్నికల్లో విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. తద్వారా దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించనున్న మొట్టమొదటి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఈసందర్భంగా ముర్ముకు దేశ విదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే క్రియేటివ్‌గా యాడ్‌లను రూపొందించే ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ ఇండియా (Amul India) రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సాదర స్వాగతం పలికేందుకు స్పెషల్‌ డూడుల్‌ను రూపొందించింది. దీన్ని అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తూ ‘వెల్‌కమ్‌ మేడం ప్రెసిడెంట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా షేర్‌ చేసిన ఫొటోలో రాష్ట్రపతి భవనం ఎదుట ద్రౌపది ముర్ము నమస్కరిస్తూ కనిపించారు. ఈ పోస్టర్‌పై భాగంలో ముర్‌మదర్‌ ఇండియా అని రాసి ఉండగా కింద ‘ అమూల్‌ టాప్‌ పొజిషన్‌ ఇన్‌ బటర్స్‌’ అని రాసి ఉంది. కాగా ముర్‌మదర్‌ ఇండియా అంటే మదర్‌ ఇండియా అని అర్థం.

ప్రస్తుతం అమూల్‌ ఇండియా డూడుల్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నూతన రాష్ట్రపతికి ఎంతో క్రియేటివిటీగా వెల్‌కమ్‌ చెప్పారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో రేపు ఉదయం 10.15 గంటలకు ముర్ము చేత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి హోదాలో తొలిసారు ద్రౌపది ముర్ము ప్రసంగం ఉంటుంది. కాగా ప్రమాణ స్వీకారానికి ముందు ఆమె ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్‌తో కలిసి పార్లమెంటుకు ఊరేగింపుగా వస్తారు. ఇక రాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి సంబంధించి ఉన్నతాధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..