చెన్నైలోని అమ్మోనియం నైట్రేట్‌ తెలంగాణకు తరలింపు

చెన్నైలోని మనాలిలో ఉన్న అమ్మోనియం నైట్రిట్ నిల్వలు తెలంగాణకు తరలిస్తున్నారు. లెబనాన్‌లోని బీరూట్‌లో పేలుడు తరువాత తమిళనాడులో అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల

చెన్నైలోని అమ్మోనియం నైట్రేట్‌ తెలంగాణకు తరలింపు

Edited By:

Updated on: Aug 10, 2020 | 10:27 AM

ammonium nitrate stockpile: చెన్నైలోని మనాలిలో ఉన్న అమ్మోనియం నైట్రిట్ నిల్వలు తెలంగాణకు తరలిస్తున్నారు. లెబనాన్‌లోని బీరూట్‌లో పేలుడు తరువాత తమిళనాడులో అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల అంశం వివాదంగా మారింది. చెన్నైలోని మనాలి పుదునగర్‌లో 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. వీటిపై కస్టమ్స్, డీజీపీ స్థాయి అధికారులు సమీక్ష జరిపి ఎలాంటి ప్రమాదం జరగదని హామీ ఇచ్చారు. అయినప్పటికీ స్థానికులు, మత్యకారులు ఆందోళనలకు దిగడంతో అమ్మోనియం నైట్రేట్‌ తరలింపుపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ముందుగా 10 కంటైనర్‌లలో 202 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ని హైదరాబాద్‌కి తరలించనున్నారు. ఈ కంటైనర్లను ఎక్కడ ఆగకుండా ప్రైవేట్ సిబ్బంది,ఫైర్ సిబ్బందితో పాటు చేరుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. చెన్నైలో మిగిలి ఉన్న 27 కంటైనర్‌లను ఇతర ప్రాంతాలకు తరలించడానికి అన్ని చర్యలు చేపడతామని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Read This Story Also: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పెనుమత్స సాంబశివరాజు కన్నుమూత