National Cooperative Conference : ఢిల్లీ వేదికగా నేడు సహకార సంస్థల మెగా సదస్సు.. తొలిసారి ప్రసంగించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా..

|

Sep 25, 2021 | 7:21 AM

National Cooperative Conference : కేంద్ర కేబినెట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హోం మంత్రి అమిత్ షా.. నేడు జరుగనున్న సహకార సంస్థల మెగా..

National Cooperative Conference : ఢిల్లీ వేదికగా నేడు సహకార సంస్థల మెగా సదస్సు.. తొలిసారి ప్రసంగించనున్న కేంద్ర మంత్రి అమిత్ షా..
Amith Sah
Follow us on

National Cooperative Conference : కేంద్ర కేబినెట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హోం మంత్రి అమిత్ షా.. నేడు జరుగనున్న సహకార సంస్థల మెగా సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలకు చెందిన 8 కోట్ల మంది సభ్యులతో ఆయన మాట్లాడనున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ సమావేశం జరగనుండగా.. ఈ కాన్ఫరెన్స్‌‌ను సహకార సంస్థలు IFFCO, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమూల్, సహకార భారతి, NAFED, KRIBHCOతోపాటు ఇతర సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి వరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న సహకార శాఖను ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను హోంమంత్రి అమిత్ షా కు అప్పగించారు. తాజాగా ఈ శాఖకు కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి దేవేంద్ర కుమార్ సింగ్‌ను కార్యదర్శిగా నియమించారు.

ఇదిలాఉంటే.. ఈ సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ సహకరా రంగం అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించిందో, ప్రభుత్వ విజన్ ఏంటనే విషయాలను ప్రధానంగా అమిత్ షా వెల్లడించనున్నారు. ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వ విజన్, రోడ్‌మ్యాప్ గురించి ఆయన వివరించనున్నారు. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఏడాది జూలైలో సృష్టించబడిన కొత్త సహకార మంత్రిత్వ శాఖకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా షా ప్రసంగించాల్సిన మొదటి జాతీయ సహకార సమావేశం ఇదే కావడం విశేషం.

ఈ కార్యక్రమానికి సహకార శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ మరియు అంతర్జాతీయ సహకార కూటమి (గ్లోబల్) అధ్యక్షుడు ఏరియల్ గార్కో కూడా హాజరవుతారు. దాదాపు 2వేల మందికి పైగా ఈ సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొంటుండగా.. 8 కోట్ల మంది వర్చువల్‌గా పాల్గొంటున్నారు. 110 దేశాల్లోని 3 మిలియన్ల సహకార సంస్థలు భాగమైన ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ (గ్లోబల్) సంస్థ కూడా వర్చువల్‌గా ఈ సదస్సులో పాల్గొననున్నట్లు ఐఎఫ్‌ఎఫ్‌సీవో(IFFCO) తెలిపింది.

ప్రపంచ స్థాయిలో భారతీయ సహకార సంఘాలను బలోపేతం చేయడంలో ఈ సమావేశం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ లక్ష్యాన్ని సాధించడానికి కూడా ఇది పని చేస్తుందని ఇఫ్కో ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం, ప్రత్యేక పరిపాలన, చట్టపరమైన, విధానపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించడం, బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (MSCS) అభివృద్ధిని ప్రారంభించడానికి ప్రక్రియలను క్రమబద్ధీకరించడం మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

Also read:

Gold-Silver Price Today: మహిళలు గుడ్ న్యూస్.. భారీగా దిగివచ్చిన బంగారం ధరలు.. అదే బాటలో పయనిస్తున్న వెండి

Crime News: విజయనగరంలో దారుణం.. మైనర్ బాలిక కిడ్నాప్.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ గురిచేసే విషయాలు!

Direct Taxes: కోవిడ్ కాలంలోనూ పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. గత సంవత్సరంతో పోలిస్తే భారీ పెరుగుదల..