వలస కార్మికులకు బిగ్ బి చేసిన హెల్ప్ ఏంటో తెలుసా…

వలస కార్మికుల పాలిట హీరోగా మారిన సోను సూద్… దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు అదే బాటలో నేను సైతం అంటూ ముందుకు వచ్చారు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. ముంబై నగరంలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను తరలించేందుకు 10 బస్సులను ఏర్పాట్లు చేశారు. ఏబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ యాదవ్, మాహిం దర్గా ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ సుహైల్ ఖండ్వానీలు ముంబై నగరం నుంచి 43 మంది పిల్లలు, 225 మంది వలస కార్మికుల 10 […]

వలస కార్మికులకు బిగ్ బి చేసిన హెల్ప్ ఏంటో తెలుసా...

Updated on: May 30, 2020 | 10:36 AM

వలస కార్మికుల పాలిట హీరోగా మారిన సోను సూద్… దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పుడు అదే బాటలో నేను సైతం అంటూ ముందుకు వచ్చారు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. ముంబై నగరంలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను తరలించేందుకు 10 బస్సులను ఏర్పాట్లు చేశారు. ఏబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ యాదవ్, మాహిం దర్గా ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ సుహైల్ ఖండ్వానీలు ముంబై నగరం నుంచి 43 మంది పిల్లలు, 225 మంది వలస కార్మికుల 10 బస్సుల్లో తరలించారు.

వలస కార్మికులను వారి స్వస్థలమైన యూపీకి పంపించేందుకు అమితాబ్ ముందుకు రావటంతో తాము ఈ ఏర్పాట్లు చేశామని హాజీఅలీ, మహిం దర్గా నిర్వాహకులు సబీర్ సయ్యద్ తెలిపారు. తమ దర్గాతో బిగ్ బికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1983వ సంవత్సరంలో హాజీఅలీ దర్గాలో అమితాబ్ కూలీ సినిమాను చిత్రీకరించారని అన్నారు. ఇదే చిత్రం షూటింగ్ సమయంలో అమితాబ్  తీవ్రంగా గాయపడి కొన్ని నెలలతర్వాత కోలుకున్నారని అన్నారు. అప్పటి నుంచి అమితాబ్ ఈ దర్గా వస్తుంటారని తెలిపారు. దీంతో హాజీఅలీ దర్గా ప్రాంతంలోని వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపించేందుకు అమితాబ్ 10 బస్సులు అందించారు. అయితే గత కొన్ని రోజులుగా వలసకార్మికులకు ఆహారం, మందులు అందిస్తున్నారని సబీర్ సయ్యద్ చెప్పారు.