Attack on Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటన.. ఇవాళ ఉభయసభల్లో హోంమంత్రి అమిత్ షా ప్రకటన

|

Feb 07, 2022 | 9:51 AM

ఉత్తరప్రదేశ్‌లో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన ఇవ్వనున్నారు.

Attack on Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటన.. ఇవాళ ఉభయసభల్లో హోంమంత్రి అమిత్ షా ప్రకటన
Amit Shah On Owaisi
Follow us on

Amit Shah on Asaduddin Owaisi attack: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ఏఐఎంఐఎం(AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ(Hyderabad MP) అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన ఇవ్వనున్నారు. అమిత్ షా సోమవారం ఉదయం 11.30 గంటలకు లోక్‌సభ, రాజ్యసభల్లో తన ప్రకటనను సమర్పించనున్నారు. అంతే కాదు మహా గాయని లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలను గంటపాటు వాయిదా వేయనున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఒవైసీ కారుపై మీరట్‌ టోల్ ప్లాజా వద్ద దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొని మీరట్ నుండి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి 24లోని హాపూర్ ఘజియాబాద్ సెక్షన్‌లోని చిజార్సి టోల్ ప్లాజా సమీపంలో సాయంత్రం ఆరు గంటలకు అతని కారుపై బుల్లెట్ దూసుకుపోయింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ఇద్దరు వ్యక్తులు తనను అనుసరిస్తూ వచ్చి మీరట్ వద్ద కాల్పులు జరిపినట్లు ఒవైసీ లోక్‌సభలో పేర్కొన్నారు.

ఫిబ్రవరి 3న యుపిలోని హాపూర్ జిల్లాలోని పిఎస్ పిల్ఖువా పరిధిలోని ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు లోక్‌సభతో పాటు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. రాజ్యసభలో ఉదయం 10:30 గంటలకు, లోక్‌సభలో సాయంత్రం 4 గంటలకు ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.

ఇదిలావుంటే, అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఒవైసీ కారుపై కాల్పుల ఘటన తర్వాత, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కమాండోల ఆధ్వర్యంలో ఒవైసీకి ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గురువారం తన వాహనంపై కాల్పులు జరిగిన తర్వాత ‘జెడ్’ కేటగిరీ భద్రతను కల్పిస్తామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఒవైసీ శుక్రవారం తిరస్కరించడం గమనార్హం. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఈ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోందన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా సోమవారం అంటే ఈరోజు సభలో ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ఒవైసీ మాట్లాడుతూ ‘నాకు ‘జెడ్’ కేటగిరీ భద్రత వద్దు. ఉక్కిరిబిక్కిరి అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. నేను బతికి ఉండాలంటే నా గొంతు పెంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని అన్నారు. మరోవైపు, ఒవైసీ కారుపై కాల్పులు జరిపినందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ఇదివరకే తెలిపారు.

Read Also… China – Pak Relations: చైనాపై ఆధారపడ్డ పాకిస్తాన్ విదేశాంగ విధానం.. అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్