Amit Shah summoned: కేంద్ర హోం మంత్రి ‘అమిత్ షా’కు సమన్లు జారీ చేసింది బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు. ఈ నెల 22న 10 గంటలకు కోర్టులో వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని ఆదేశించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) లోని సెక్షన్ 500 కింద పరువు నష్టం ఆరోపణలకు వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా షా హాజరు అవసరమని న్యాయమూర్తి ఆదేశించారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. 2018 ఆగస్టు 11న కోల్కతాలో మాయో రోడ్‌లో బీజేపీ చేపట్టిన ఓ ర్యాలీలో టీఎంసీ ఎంపీ బెనర్జీని కించపరిచేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని.. బెనర్జీ లాయర్ సంజయ్ బసు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
Also Read:
ఐడియా అదుర్స్.. మొక్కజొన్న పంటను కాపాడుకోడానికి రైతన్నల క్రేజీ ప్లాన్స్.. ఏం చేస్తున్నారంటే..