Amit Shah: ‘వారి స్వభావంలోనే అవినీతి ఉంది’.. కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో దొరికిన డబ్బుపై అమిత్ షా ఏమన్నారంటే..?

|

Dec 10, 2023 | 8:19 PM

కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ధీరజ్‌సాహు నివాసాల్లో , కార్యాలయాల్లో వరుసగా ఐదోరోజు కూడా నోట్ల కట్టల లెక్కింపు కొనసాగుతోంది. దాదాపు 300 కోట్ల నగదును ఐటీ శాఖ సీజ్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఒడిశా, కోల్‌కతా జార్ఖండ్‌లో సోదాలు కొనసాగాయి. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు సాహు నుంచే నిధులు అందుతున్నాయని దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ధీరజ్‌సాహు వ్యవహారంపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

Amit Shah: ‘వారి స్వభావంలోనే అవినీతి ఉంది’.. కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో దొరికిన డబ్బుపై అమిత్ షా ఏమన్నారంటే..?
Amit Shah
Follow us on

కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ధీరజ్‌సాహు నివాసాల్లో , కార్యాలయాల్లో వరుసగా ఐదోరోజు కూడా నోట్ల కట్టల లెక్కింపు కొనసాగుతోంది. దాదాపు 300 కోట్ల నగదును ఐటీ శాఖ సీజ్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఒడిశా, కోల్‌కతా జార్ఖండ్‌లో సోదాలు కొనసాగాయి. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు సాహు నుంచే నిధులు అందుతున్నాయని దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ధీరజ్‌సాహు వ్యవహారంపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. దేశంలో ఎక్కడైనా విపక్ష నేతలపై ఐటీ సోదాలు జరిగితే స్పందించే కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ధీరజ్‌సాహు వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఇంకా.. ఒడిశా లోని బాలంగిర్‌లో ధీరజ్‌ సాహుకు సంబంధించిన అక్రమ సంపాదనను లెక్కిస్తున్నారు. ఓ రూమ్‌ నిండా కరెన్సీ కట్టలు ఉన్నాయి. 40 మంది ఐటీ శాఖ సిబ్బంది , బ్యాంక్‌ సిబ్బంది సాయంతో నోట్లను లెక్కిస్తున్నారు. 40 నోట్ల లెక్కింపు యంత్రాలను అధికారులు ఉపయోగిస్తున్నారు. అయితే నోట్లను లెక్కించడానికి సిబ్బంది సరిపోవడం లేదని , మరికొంతమంది సిబ్బందిని పంపించాలని ఐటీ శాఖ అధికారులు కోరుతున్నారు. ధీరజ్‌సాహుకు కాంగ్రెస్‌ మూడు సార్లు ఎందుకు రాజ్యసభ సీట్లు ఇచ్చిందో సమాధానం చెప్పాలని బీజేపీ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో దొరికిన డబ్బుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.

కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుపై జరిగిన దాడిలో ఇప్పటివరకు రూ.200 కోట్లకుపైగా నగదు లభించడంపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తాను చాలా ఆశ్చర్యపోయానంటూ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఓ ఎంపీ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. కోట్లాది రూపాయలు దొరికాయి.. కానీ మొత్తం ఇండియా కూటమి ఈ అవినీతిపై మౌనంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వారి స్వభావంలో అవినీతి ఉంది.. JDU, RJD, DMK, SP అందరూ మౌనంగా కూర్చున్నారు.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేశారో ఇప్పుడు అర్థమైంది.. ఏజన్సీలు దుర్వినియోగం అవుతున్నాయని.. తమ అవినీతి రహస్యాలన్నీ బయటపడతాయనే భయం వారి మనసులో ఉండడంతో వారు ఇలాంటి వారిని ప్రొత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు.

అమిత్ షా వీడియో..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..