వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటి వారిని తరిమేస్తాం.. అమిత్ షా

| Edited By: Rajesh Sharma

Oct 11, 2019 | 8:18 AM

ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తారు మోడీషాలు. తాము సెట్ చేసుకున్న ఎజెండాకే పెద్ద పీట వేస్తూ.. తరచూ ఏదో ఒక హాట్ టాపిక్‌ను తెర మీదకు తీసుకొచ్చే ఈ ద్వయం ప్రస్తుతం ఎన్‌ఆర్‌సీ అంటూ పెద్ద సంచలనం సృష్టించారు. ఇక ఈ అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న వేళ.. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివసిస్తున్న […]

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటి వారిని తరిమేస్తాం.. అమిత్ షా
Follow us on

ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా నిలుస్తారు మోడీషాలు. తాము సెట్ చేసుకున్న ఎజెండాకే పెద్ద పీట వేస్తూ.. తరచూ ఏదో ఒక హాట్ టాపిక్‌ను తెర మీదకు తీసుకొచ్చే ఈ ద్వయం ప్రస్తుతం ఎన్‌ఆర్‌సీ అంటూ పెద్ద సంచలనం సృష్టించారు. ఇక ఈ అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న వేళ.. దీనిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

2024 ఎన్నికల నాటికి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారందరిని గెంటివేస్తామంటూ అమిత్ షా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం హర్యానా అసెంబ్లీకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కథియాల్ జిల్లాకు పర్యటించిన ఆయన.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేయడంతో మరోసారి వివాదానికి తెర లేపారు.

70 ఏళ్లుగా అక్రమ వలసదారులు దేశ ప్రజలందరికి అందాల్సినవి అనుభవిస్తూ.. ధైర్యంగా బతుకుతున్నారని.. అలాంటివారిని దేశం నుంచి పంపించే సమయం దగ్గరపడిందన్నారు. 2024లో మరోసారి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకువస్తామని.. అంతకుముందే.. ఈ అక్రమ వలసదారులు దేశంలో ఉండరని అమిత్ షా స్పష్టం చేశారు.

బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి నిర్ణయాలు దేశానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక రఫెల్ ఫైటర్ జెట్‌కు డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాధ్ సింగ్ చేసిన ఆయుధ పూజను హేళన చేసిన కాంగ్రెస్‌పై కూడా అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు.