మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Nov 18, 2019 | 3:48 AM

మహారాష్ట్ర రాజకీయం మళ్లీ మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అక్కడ రాష్ట్రపతి పాలనకొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వైపు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్న వార్తలు వినిపిస్తుంటే..  త్వరలో రాష్ట్రంలో బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు అథవాలే. తాజాగా అమిత్ షాతో కలిసి మహారాష్ట్ర అంశాన్ని ప్రస్తావించినప్పుడు అంతా సవ్యంగా సాగుతుందంటూ ధీమాను వ్యక్తం చేశారన్నారు. మీరు మధ్య మధ్యవర్తిత్వం చేస్తే.. […]

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
Follow us on

మహారాష్ట్ర రాజకీయం మళ్లీ మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అక్కడ రాష్ట్రపతి పాలనకొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వైపు ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్న వార్తలు వినిపిస్తుంటే..  త్వరలో రాష్ట్రంలో బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు అథవాలే. తాజాగా అమిత్ షాతో కలిసి మహారాష్ట్ర అంశాన్ని ప్రస్తావించినప్పుడు అంతా సవ్యంగా సాగుతుందంటూ ధీమాను వ్యక్తం చేశారన్నారు. మీరు మధ్య మధ్యవర్తిత్వం చేస్తే.. ఈ సమస్యకు చెక్ పడుతుందని అమిత్ షాతో అన్నానని.. ఆ సమయంలో డోంట్ వర్రీ.. అంతా సెట్ అవుతుందన్నారని అథవాలే పేర్కొన్నారు.

కాగా, బీజేపీ-శివసేన మధ్య సీఎం సీటు విషయంలో విభేదాలు తలెత్తడంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలికినా.. బీజేపీ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేదని.. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ చేతులెత్తేసింది. ఇక శివసేన, ఎన్సీపీలకు కూడా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు కూడా గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేకపోవడంతో రాష్ట్రపతి పాలనకు దారితీసింది.ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చర్చలు జరుపుతోంది. ఇక రేపో మాపో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుందని అంతా అనుకుంటున్న వేళ.. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

మరోవైపు శివసేన మాత్రం బీజేపీపై శనివారం తీవ్ర విమర్శలు గుప్పించింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ నేతలు ట్రై చేస్తున్నారంటూ ఆరోపించింది.