Amit Shah: ఉత్తరాఖండ్‌లోని భారీ వర్షాలు, వరదలకు కకావికలమైన ప్రాంతాల్లో అమిత్ షా ఏరియల్‌ సర్వే

|

Oct 21, 2021 | 2:29 PM

ఉత్తరాఖండ్‌లో పర్యటించారు కేంద్రహోంమంత్రి అమిత్‌షా. భారీ వర్షాలు, వరదలకు కకావికలమైన ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎం పుష్కర సింగ్‌ ధామీ, గవర్నర్‌ లెఫ్టినెంట్‌

Amit Shah: ఉత్తరాఖండ్‌లోని భారీ వర్షాలు, వరదలకు కకావికలమైన ప్రాంతాల్లో అమిత్ షా ఏరియల్‌ సర్వే
Amit Shah
Follow us on

Amit Shah areal survey: ఉత్తరాఖండ్‌లో పర్యటించారు కేంద్రహోంమంత్రి అమిత్‌షా. భారీ వర్షాలు, వరదలకు కకావికలమైన ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎం పుష్కర సింగ్‌ ధామీ, గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఎన్నడూ లేనఉత్తరాఖండ్‌లో నాలుగు రోజుల పాటు కురిసిన కుండపోతకు 52 మంది మృత్యువాత పడ్డారు.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు 107 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్‌ చేశాయి. వరుణుడి దెబ్బకు దేవభూమి విలవిలలాడిపోయింది. ఎడతెరిపిలేకుండా కురిసిన వానలకు భారీ వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లు, రైల్వే ట్రాకులు, బ్రిడ్జిలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి.

కుండపోత వానలు, వరదల ధాటికి కుదేలైన ఉత్తరాఖండ్‌లో సహాయకచర్యలు చేపట్టింది రెస్క్యూ టీమ్‌. భారత వాయుసేనకు చెందిన మూడు హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం పుష్కరసింగ్‌ ధామీ. పంటనష్టంపై నివేదిక సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిందని..కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. సహాయక చర్యలకు ప్రతి జిల్లాకు 10 కోట్లు చొప్పున మంజూరు చేశారు.

Read also: Sajjala: టీడీపీ లైన్‌ దాటింది.. ఏమైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: సజ్జల రామకృష్ణారెడ్డి