Uttarakhand Flood: ఉత్తరాఖండ్‌ జల ప్రళయంపై నిరంతరం సమీక్షిస్తున్నాం.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Uttarakhand Flood - Rajya Sabha: హిమాలయాల్లో మంచుచరియలు విరిగిపడి దేవభూమి ఉత్తరాఖండ్‌లో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ధౌలీ గంగా నది ఉప్పొంగి పరివాహక ప్రాంతాల్లో భీభత్సం సృష్టించింది. ఈ జల ప్రళయంలో...

Uttarakhand Flood: ఉత్తరాఖండ్‌ జల ప్రళయంపై నిరంతరం సమీక్షిస్తున్నాం.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Updated on: Feb 09, 2021 | 4:10 PM

Uttarakhand Flood – Rajya Sabha: హిమాలయాల్లో మంచుచరియలు విరిగిపడి దేవభూమి ఉత్తరాఖండ్‌లో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ధౌలీ గంగా నది ఉప్పొంగి పరివాహక ప్రాంతాల్లో భీభత్సం సృష్టించింది. ఈ జల ప్రళయంలో 200 మంది వరకు గల్లంతు కాగా.. విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఈ జ‌ల‌ప్ర‌ళ‌యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ ‌షా రాజ్య‌స‌భ‌లో మంగళవారం ప్ర‌క‌ట‌న చేశారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన అన్ని అధికార యంత్రాంగాలు, ఏజెన్సీలు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నాయ‌ని షా పేర్కొన్నారు. కేంద్రం కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తోందని ఆయన తెలిపారు.

మొత్తం 450 మంది ఐటీబీపీ జ‌వాన్లు, 5 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, 8 ఇండియ‌న్ ఆర్మీ బృందాలు, నేవీ బృందం, 5 ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ హెలిక్యాప్ట‌ర్ల‌ను రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో వినియోగిస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి ప్ర‌క‌ట‌న అనంత‌రం రాజ్య‌స‌భ స‌భ్యులు ఎవ‌రి స్థానాల్లో వారు లేచి నిల‌బ‌డి ఉత్త‌రాఖండ్ జ‌ల‌ప్ర‌ళ‌యం బాధితుల‌కు నివాళులర్పించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఇప్పటివరకు 28 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read:

Ghulam Nabi Azad Emotional: హిందుస్థానీగా గర్విస్తున్నా.. ఆయన నుంచే అన్నీ నేర్చుకున్నా…!

మంగళంపల్లి, లతామంగేష్కర్ వంటి ఎందరినో తెలుగు తెరకు పరిచయం చేసిన స్వర బ్రహ్మ సుసర్ల దక్షిణామూర్తి వర్ధంతి నేడు