Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే సిద్ధమవ్వండి త్వరలోనే ప్రారంభం

అమర్‌నాథ్ యాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. హిందువులు పవిత్రంగా భావించే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.అయితే ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్ర త్వరలోనే ప్రారంభం కానుంది. జులై 1 న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 31న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే సిద్ధమవ్వండి త్వరలోనే ప్రారంభం
Amarnath Yathra

Updated on: Apr 15, 2023 | 9:31 AM

అమర్‌నాథ్ యాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. హిందువులు పవిత్రంగా భావించే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు.అయితే ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్ర త్వరలోనే ప్రారంభం కానుంది. జులై 1 న యాత్ర ప్రారంభమై.. ఆగస్టు 31న ముగుస్తుందని జుమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లలో యాత్రికుల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని తెలిపింది. ఈ యాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా జరిగేందుకు తమ అడ్మినిస్ట్రేషన్ కట్టుబడి ఉందని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహా తెలిపారు.

అమర్‌నాథ్ యాత్రకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసహాయంతో పటు అనేక సౌకర్యాలు అందిస్తామని పేర్కొన్నారు. యాత్ర ప్రారంభానికి ముందే టెలికామ్ సేవలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. లాడ్జింగ్, విద్యుత్, నీరు, భద్రత లాంటి ఇతర సదుపాయాలు కల్పించేదుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే
అనంత్‌నాగ్ జిల్లాలోని పహలాగ్రామ్ అలాగే గందెర్బల్ జిల్లాలోని బాల్తల్ రూట్ల నుంచి ఒకేసారి ఈ యాత్ర ప్రారంభం కానుంది. యాత్ర జరిగే ప్రాంతాల్లో పరిశుభ్రత ఉండాలని..శానిటైజేషన్, వ్యర్థ పదార్ధాల తొలగింపు ప్రక్రియపై వెంటనే చర్యలు తీసుకోవాలని  మనోజ్ సింహా అధికారులకు ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి