బెంగాల్ లో సిక్కుకు అవమానం, పంజాబ్ సీఎం ఆగ్రహం

| Edited By: Anil kumar poka

Oct 10, 2020 | 10:57 AM

పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో బీజేపీ ర్యాలీ సందర్భంగా ఓ సిక్కు యువకుని తలపాగాను పోలీసులు లాగివేయడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది మతపరమైన సెంటిమెంట్గ్లను బాధించడమేనన్నారు.

బెంగాల్ లో సిక్కుకు అవమానం, పంజాబ్ సీఎం ఆగ్రహం
Follow us on

పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో బీజేపీ ర్యాలీ సందర్భంగా ఓ సిక్కు యువకుని తలపాగాను పోలీసులు లాగివేయడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది మతపరమైన సెంటిమెంట్గ్లను బాధించడమేనన్నారు. పిస్టల్ ను కలిగి ఉన్న ఆ సిక్కును పోలీసులు అరెస్టు చేయబోగా ఆ వ్యక్తి ప్రతిఘటించి వారిపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో ఓ పోలీసు అతని తలపాగాను లాగిపారేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. కాగా ఆ సంబంధిత పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని అమరేందర్ సింగ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరుతూ ట్వీట్ చేశారు. అయితే ఎవరి సెంటిమెంటునూ బాధించాలన్న ఉద్దేశం తమకు లేదని, జరిగిన పెనుగులాటలో ఆ సిక్కు తలపాగా ఊడి కింద పడిపోయిందని బెంగాల్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.