Assembly Elections: ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి.. ఈసీకి విజ్ఞప్తి.. కారణం ఏంటంటే..

|

Jan 03, 2022 | 6:11 AM

Assembly Elections: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడు కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌..

Assembly Elections: ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయండి.. ఈసీకి విజ్ఞప్తి.. కారణం ఏంటంటే..
Follow us on

Assembly Elections: దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడు కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాప్తిస్తోంది. గతంలో ప్రమాదకరమైన డెల్టా వేరియంట్‌ కంటే ప్రమాదకరంగా వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్న తరుణంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక దేశంలో పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒమిక్రాన్‌ వైరస్‌ వల్ల గోవా, మణిపూర్‌, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో నిర్వహించే ఎన్నికలను వాయిదా వేయాలని అఖిల భారత బార్ అసోసియేషన్ ఆదివారం భారత ఎన్నికల సంఘానికి మెమోరాండం పంపింది. వైరస్‌ వ్యాప్తి కారణంగా వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఎఐబిఎ ప్రెసిడెంట్ సీనియర్ న్యాయవాది డాక్టర్ ఆదిష్ సి అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నికల ర్యాలీలకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారని అన్నారు .

ఒమిక్రాన్ మరియు కరోనా ముగిసే వరకు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలను వాయిదా వేయకపోతే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అస్సాం, కేరళ, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ అనే 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల సమయంలో భారతదేశ ప్రజల నిర్లక్ష్యం కారణంగా కోవిడ్ -19 యొక్క సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా వ్యాప్తి చెందిందని గుర్తు చేశారు.

దేశంలో కరోనా యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌ల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇక ఎన్నికల సంఘం దేశ ప్రజల ఆరోగ్యం, భద్రత గురించి పట్టించుకోకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిందన్నారు. అదే సమయంలో, కోవిడ్ -19 ఓమిక్రాన్ వేరియంట్ దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితులు ఉన్నాయని పరిగణనలోకి తీసుకోకుండా, మరో 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని, ఈ రాష్ట్రాలలో ఎన్నికలు వాయిదా వేయాలన్నారు.

పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా చైనా, నెదర్లాండ్స్, జర్మనీ మొదలైనవి దేశాలలో పాక్షిక లేదా పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేశాయి. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం కారణంగా అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అయితే డిసెంబర్‌ 30న లక్నోలో విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన తర్వాత ఎన్నికల విషయంలో ఎలాంటి జాప్యం జరగదని చెప్పడం ఆశ్చర్యమేసిందన్నారు.

ఇవి కూడా చదవండి:

Coronavirus: కరోనా కలకలం.. నవోదయ విద్యాలయంలో 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌

Lockdown: కరోనా ఎఫెక్ట్‌.. ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌.. రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలల మూసివేత..!