స్కూళ్లు, కాలేజీలు ఓపెనింగ్ ఇప్పట్లో లేనట్లేనా..? కేంద్రం ఏం చెప్పిందంటే..?

| Edited By:

May 27, 2020 | 12:24 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు లక్షన్నరకు చేరువలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింలపులతో లాక్‌డౌన్ కొనసాగిస్తోంది. అయితే మొన్నటి వరకు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనుకున్న క్రమంలో.. మళ్లీ కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం విద్యాసంస్థల పునఃప్రారంభంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే మే 31 వరకు దేశంలోని అన్ని విద్యా సంస్థలను మూసివేసి ఉంచాలని కేంద్రం […]

స్కూళ్లు, కాలేజీలు ఓపెనింగ్ ఇప్పట్లో లేనట్లేనా..? కేంద్రం ఏం చెప్పిందంటే..?
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు లక్షన్నరకు చేరువలో ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింలపులతో లాక్‌డౌన్ కొనసాగిస్తోంది. అయితే మొన్నటి వరకు పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనుకున్న క్రమంలో.. మళ్లీ కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం విద్యాసంస్థల పునఃప్రారంభంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇప్పటికే మే 31 వరకు దేశంలోని అన్ని విద్యా సంస్థలను మూసివేసి ఉంచాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేసుల తీవ్రత పెరుగుతున్న క్రమంలో.. విద్యాసంస్థల ఓపెనింగ్‌పై కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రెస్ ఇన్‌ఫర్‌మేషన్ బ్యూరో ప్రకటించింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు రీ ఓపెనింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు రావడంతో.. ప్రెస్ ఇన్‌ఫర్‌మేషన్ బ్యూరో మరోసారి స్పష్టం చేసింది. విద్యాసంస్థల పునః ప్రారంభంపై.. మే 31 తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.