కోవిడ్ పై పోరు, రోగుల కోసం 100 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ల ను డొనేట్ చేసిన అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా

| Edited By: Phani CH

Apr 28, 2021 | 1:48 PM

కోవిద్ పై పోరుకు తాము ఎప్పుడూ ముందుంటామని బాలీవుడ్ అక్షయ నటుడు అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ప్రకటించారు.  ఈ క్లిష్ట తరుణంలో  ప్రతివారూ తమకు తోచిన సాయం చేయాలనీ వారు  కోరారు.

కోవిడ్ పై పోరు, రోగుల కోసం 100 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్ల ను డొనేట్ చేసిన అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా
Akshay Kumar
Follow us on

కోవిద్ పై పోరుకు తాము ఎప్పుడూ ముందుంటామని బాలీవుడ్ అక్షయ నటుడు అక్షయ్ కుమార్, ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ప్రకటించారు.  ఈ క్లిష్ట తరుణంలో  ప్రతివారూ తమకు తోచిన సాయం చేయాలనీ వారు  కోరారు. తమ వంతు సాయంలో  భాగంగా 100 ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లను డొనేట్ చేస్తున్నామని  ప్రకటించారు. తమ కుటుంబం ఇటీవల కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నదని ,  అయితే కోవిడ్ బాధితులకు సాయం చేయాలన్నదే తమ  యోచన  అని ట్వింకిల్ ఖన్నా ట్వీట్  చేశారు.  ఇందులోనే తమకు తృప్తి ఉందన్నారు. లండన్ కు చెందిన డాక్టర్ ద్రష్టికా  పటేల్, డా. గోవింద్ బంకానీ ఆధ్వర్యంలోని లండన్ ఎలైట్  సంస్ట ద్వారాను, వారి ఫౌండేషన్ ద్వారాను 120 ఆక్సిజన్ కాంసెంట్రేటర్లను కోవిద్ బాధితులకోసం డొనేట్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మా వద్ద మొత్తం 220 ఆక్సిజన్ కాంసెంట్రీటర్లు ఉన్నాయని వాటిలో వంద కాన్సెన్ట్రేటర్లను ఇస్తున్నామని ఆమె వెల్లడించారు.   ఆమధ్య కరోనా పాజిటివ్ కి గురైన అక్షయ్ కుమార్ వారం రోజుల పాటు ముంబైలోని  ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్  అయ్యాడు.

కాగా ఇటీవలే అక్షయ్.. క్రికెటర్ గౌతమ్ గంభీర్ అద్వర్యం లోని ఫౌండేషన్ కి కోటి రూపాయల విరాళాన్ని  ప్రకటించాడు.   ఈ సొమ్మును కోవిద్ రోగులకు అవసరమైన ఆక్సిజన్, వైద్య  పరికరాలు, మందులు తదితరాల కొనుగోలుకు వినియోగించాలని ఆయన కోరాడు.  ఇందుకు గంభీర్ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ క్లిష్ట సమయంలో  ఎంత మేర సాయం చేసినా అది  గొప్ప ఆశా కిరణమవుతుందన్నాడు.  దేశంలో కోవిద్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఈ తరుణంలో ప్రతివారూ తమ ఫౌండేషన్ కి సాయం చేయాలని అన్యాపదేశంగా కోరాడు.  ఇలా ఉండగా దేశంలో గత 24 గంటల్లో 3.60 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 3,293 కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య సుమారు 2 లక్షలకు చేరింది. మహారాష్ట్ర తరువాత యూపీ, కేరళ,  కర్నాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Eknath Gaikwad: కరోనాతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గైక్వాడ్ కన్నుమూత.. పలువురి సంతాపం..

Maharashtra Pharma Fire: మహారాష్ట్రలో మరో అగ్ని ప్రమాదం.. ఫార్మా కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు.. దట్టంగా కమ్ముకున్న పొగలు