రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో నాయకత్వ మార్పు జరగబోతుంది. యువతరం చేతికి పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. కంపెనీ చైర్మన్‌గా ఆకాశ్ అంబానీని ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ను ఇకపై ఆకాశ్ ముందుండి నడిపించనున్నట్లు సమాచారం. అంబానీకి ఇద్దరు కుమారులు(ఆకాశ్, అనంత్), ఒక కుమార్తె(ఈశా) కాగా.. అందులో ఆకాశ్, ఈశాలు కవలలు. పెద్ద కలలను, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యమని ఇటీవల వ్యాఖ్యానించిన ముఖేశ్.. తాజాగా తనయుడికి బాధ్యతలు అప్పగించబోతున్నట్లు వ్యాపార వర్గాల ద్వారా తెలిసింది. రిలయన్స్ ఇప్పుడు అత్యంత ముఖ్యమైన నాయకత్వ మార్పు ప్రక్రియలో ఉందని ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే ‘రిలయన్స్ ఫ్యామిలీ డే’లో ఇటీవలే ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. కాగా తాజాగా స్వచ్ఛ, హరిత ఇంధన రంగంలోకి అడుగుపెట్టింది రిలయన్స్.
Also Read: Viral: టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో ప్రేమలో పడ్డ లేడీ టీచర్.. చివరకు ఏం జరిగిందంటే..?
Telangana: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. ఆ జిల్లాలో కలకలం.. ఆరా తీయగా