మహారాష్ట్ర.. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్, మంత్రిగా ఆదిత్య థాక్రే ప్రమాణ స్వీకారం

|

Dec 30, 2019 | 4:40 PM

మహారాష్ట్రలో శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే సోమవారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్, మంత్రిగా ఉధ్ధవ్ కుమారుడు ఆదిత్య థాక్రే ప్రమాణం చేశారు. మొత్తం 36 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేయడంతో ఉధ్ధవ్ కేబినెట్లో మంత్రుల సంఖ్య పెరిగింది. ఈ 36 మందిలో పది మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. గత నవంబరు 28 న ఉధ్ధవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. ఆయనతో బాటు ఆరుగురు ప్రమాణ […]

మహారాష్ట్ర.. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్, మంత్రిగా ఆదిత్య థాక్రే ప్రమాణ స్వీకారం
Follow us on

మహారాష్ట్రలో శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే సోమవారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్, మంత్రిగా ఉధ్ధవ్ కుమారుడు ఆదిత్య థాక్రే ప్రమాణం చేశారు. మొత్తం 36 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేయడంతో ఉధ్ధవ్ కేబినెట్లో మంత్రుల సంఖ్య పెరిగింది. ఈ 36 మందిలో పది మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.

గత నవంబరు 28 న ఉధ్ధవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా.. ఆయనతో బాటు ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు . తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్, కాంగ్రెస్ నేత అమిత్ దేశ్ ముఖ్ లకు చోటు లభించింది. మహారాష్ట్రలో అధికారంలోకి వఛ్చిన శివసేన-ఎన్సీపీ కూటమి.. తమ కనీస ఉమ్మడి కార్యక్రమంలో రైతులకు పలు ‘ వరాలు ‘ ప్రకటించింది. ముఖ్యంగా వారి రుణమాఫీకి సంబంధించి ఇఛ్చిన హామీని ఉద్దవ్ ప్రభుత్వం నెరవేర్చింది. రైతులకు రెండు లక్షల రుణమాఫీని సర్కార్ ఇదివరకే ప్రకటించింది. కాగా-కొత్త మంత్రులకు ఆయా శాఖలను కేటాయించవలసి ఉంది.