ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర విషాదం.. విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పైలట్ మృతి!

బుధవారం(ఏప్రిల్ 10) శ్రీనగర్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తీసుకుని దేశ రాజధాని ఢిల్లీకి ఫైలట్ బయలుదేరాడు. ఇది అతని చివరి విమాన ప్రయాణం అవుతుందని అనుకోలేదు. నిజానికి, అతను ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన కొద్దిసేపటికే మరణించాడు. మీడియా కథనాల ప్రకారం, అతను కొన్ని ఆరోగ్య కారణాల వల్ల మరణించాడని పేర్కొన్నారు.

ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర విషాదం.. విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పైలట్ మృతి!
Air India Express

Updated on: Apr 10, 2025 | 12:55 PM

బుధవారం(ఏప్రిల్ 10) శ్రీనగర్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తీసుకుని దేశ రాజధాని ఢిల్లీకి ఫైలట్ బయలుదేరాడు. ఇది అతని చివరి విమాన ప్రయాణం అవుతుందని అనుకోలేదు. నిజానికి, అతను ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన కొద్దిసేపటికే మరణించాడు. మీడియా కథనాల ప్రకారం, అతను కొన్ని ఆరోగ్య కారణాల వల్ల మరణించాడని పేర్కొన్నారు. పైలట్ వయస్సు 40 సంవత్సరాల లోపే ఉండవచ్చని తెలిపారు. అతను శ్రీనగర్ నుండి విమానంలో వచ్చాడు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఫైలట్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించాడు.

“ఆరోగ్య కారణాల వల్ల ఒక మంచి సహోద్యోగిని కోల్పోయాము” అని ఎయిర్‌లైన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీని గురించి చాలా బాధపడుతున్నామని, సాధ్యమైన అన్ని సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ భారీ నష్టం నుండి కోలుకోవడానికి మేమందరం ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే, ఈ సమయంలో గోప్యతను గౌరవించాలని, అనవసరమైన ఊహాగానాలను నివారించాలని సంబంధిత అధికారులందరులను అభ్యర్థిస్తున్నామన్నారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..