టికెట్ ధరలను భారీగా తగ్గించిన ఎయిరిండియా

జమ్ము కాశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అమర్‌నాథ్ పర్యటనను ప్రభుత్వం రద్దు చేసింది. యాత్రకు వచ్చిన వారంతా తమ స్వస్థలాలకు చేరుకోవాలంటూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత విమానయాన సంస్ధ ఎయిరిండియా మరోసారి టికెట్ల ధరలను తగ్గించింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ఇప్పటికే టికెట్ ధరలను రూ.9,500కు తగ్గించింది. తాజాగా మరోసారి తన ధరల టారిఫ్ మార్చింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీప్రయాణానికి రూ.6,715, ఢిల్లీ నుంచి […]

టికెట్ ధరలను భారీగా తగ్గించిన ఎయిరిండియా

Edited By:

Updated on: Aug 04, 2019 | 1:54 PM

జమ్ము కాశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అమర్‌నాథ్ పర్యటనను ప్రభుత్వం రద్దు చేసింది. యాత్రకు వచ్చిన వారంతా తమ స్వస్థలాలకు చేరుకోవాలంటూ రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారత విమానయాన సంస్ధ ఎయిరిండియా మరోసారి టికెట్ల ధరలను తగ్గించింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ఇప్పటికే టికెట్ ధరలను రూ.9,500కు తగ్గించింది.

తాజాగా మరోసారి తన ధరల టారిఫ్ మార్చింది. శ్రీనగర్ నుంచి ఢిల్లీప్రయాణానికి రూ.6,715, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు రూ.6899గా ప్రకటించింది. ఈనెల 15 వతేదీ వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది ఎయిరిండియా.