ప్లాస్మా క్లినికల్ ట్రయల్.. ఎయిమ్స్ రెడీ

విషమ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని నిన్న.మొన్నటివరకు భావించిన ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ కి ఢిల్లీ లోని ఎయిమ్స్ (అఖిలభారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ) సమాయత్తమవుతోంది...

ప్లాస్మా క్లినికల్ ట్రయల్.. ఎయిమ్స్ రెడీ

Edited By:

Updated on: Apr 29, 2020 | 1:47 PM

విషమ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని నిన్న.మొన్నటివరకు భావించిన ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ కి ఢిల్లీ లోని ఎయిమ్స్ (అఖిలభారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ) సమాయత్తమవుతోంది. అయితే ఇందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం కోసం నిరీక్షిస్తోంది. ఇది ఇంకా ప్రయోగ దశలో ఉందని, ఈ థెరపీ మంచిదా, కాదా అన్న విషయమై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తో కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు.