Panneerselvam on Sasikala: శశికళని అన్నాడీఎంకే లోకి చేర్చుకునే అంశంపై పార్టీ నేతలు చర్చించాలంటూ కొత్త వాణి వినిపించారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. తన స్టాండ్ మార్చుకుంటూ ఆయన శశికళను తిరిగి పార్టీలోకి తీసుకునే అంశంమీద సానుకూల స్పందన వ్యక్తం చేశారు. శశికళ ను అన్నాడీఎంకే పార్టీ లోకి చేర్చుకునే అంశం మీద భిన్న స్వరాలు వినిపిస్తోన్న తరుణంలో సెల్వం వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రాజకీయ పార్టీలలో ఎవరైనా ఎప్పుడైనా.. వస్తారు, వేరే పార్టీలకు మారతారు. అన్నాడీఎంకే లో శశికళని చేర్చుకునే అంశంపై పార్టీ నేతలు చర్చించాలి అని పన్నీర్ సెల్వం అన్నారు. అన్నాడీఎంకే ముఖ్య నేతలు చర్చించాకే ఈ వివాదంపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన ఇవాళ మధురైలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. డీఎంకే సర్కార్ మాజీ మంత్రుల ఇళ్లలో ఏసీబీ దాడులు నిర్వహించడం రాజకీయ ప్రతీకార చర్యగా ఆయన పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలిగా ఉన్న వీకే శశికళ ఇటీవల పన్నీర్‌సెల్వంను కలిసిన సంగతి తెలిసిందే. సెల్వం భార్య పి విజయలక్ష్మి మరణానికి ఆమె సంతాపం తెలిపారు . పన్నీర్ సెల్వంను చేతులు పట్టుకుని ఆ సందర్భంలో ఓదార్చారు శశికళ.
Read also: Srikanth Reddy: మోడీ అంతు తేలుస్తానన్న వ్యక్తి.. సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు: శ్రీకాంత్ రెడ్డి