AIకి ఎడమ చేతి వాటం ఇప్పట్లో వచ్చేలా లేదు.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు! నెట్టింట జోరు చర్చ

|

Feb 12, 2025 | 8:08 PM

జనరేటివ్ AI మోడళ్లతో ఉన్న ఓ ప్రధాన సమస్యపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో చర్చించారు. అదేంటంటే ఒక మనిషి తమ ఎడమ చేతితో రాస్తున్నట్లు ఉన్న చిత్రాలను ఏఐ రూపొందించలేకపోతుందని మోదీ ప్రసంగంలో వెల్లడించారు. దీంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఎడమ చేతితో రాస్తున్న మనుషుల చిత్రాలను రూపొందించడానికి వివిధ ప్రాంప్ట్‌లను ఉపయోగించడానికి..

AIకి ఎడమ చేతి వాటం ఇప్పట్లో వచ్చేలా లేదు.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు! నెట్టింట జోరు చర్చ
AI struggles to draw writing with left hand
Follow us on

పారిస్‌లో ఫిబ్రవరి 11న జరిగిన ప్రపంచ ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగం సర్వత్రా చర్చణీయాంశంగా మారింది. ఈ ప్రసంగంలో మోదీ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. అదేంటంటే.. ఇటీవల కాలంలో కృత్రిమ మేధస్సు ఎలా ఉపయోగకరంగా మారిందో, వైద్య నివేదికలను విశ్లేషించడం, వాటిని వినియోగదారులకు సరళమైన పదాలలో వివరించడం వంటి ప్రయోజనాలు మనమందరం చూశాం. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఏఐ టెక్నాలజీ ఇప్పటికీ పూర్తి స్థాయి అంచనాలను అందుకోలేకపోతుంది. కొన్ని నెలల క్రితం మొదలైన ఉత్పాదక AI నమూనాలు ఒడిదుడుకులకు గురైనప్పటికీ చిరవకు.. మనుషుల చిత్రాలను మెరుగ్గా గీయడంలో పురోగతి సాధించింది.

అయితే జనరేటివ్ AI మోడళ్లతో ఉన్న ఓ ప్రధాన సమస్యపై ప్రధాని మోదీ ఈ సమావేశంలో చర్చించారు. అదేంటంటే ఒక మనిషి తమ ఎడమ చేతితో రాస్తున్నట్లు ఉన్న చిత్రాలను ఏఐ రూపొందించలేకపోతుందని మోదీ ప్రసంగంలో వెల్లడించారు. దీంతో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఎడమ చేతితో రాస్తున్న మనుషుల చిత్రాలను రూపొందించడానికి వివిధ ప్రాంప్ట్‌లను ఉపయోగించడానికి ప్రయత్నించారు. కానీ ఎటువంటి విజయం సాధించలేదు. చాలా మంది ఎడమ చేతితో రాస్తున్న వ్యక్తి చిత్రాన్ని అడుగుతున్న వివిధ AI ప్లాట్‌ఫారమ్‌ల పోస్ట్‌లను సైతం షేర్ చేశారు. కానీ ఎక్కడా వీటిని కనుగొన లేకపోయారు. దీంతో చివరకు ప్రధానమంత్రి మోదీ చెప్పిందే సరైనదని ఒప్పుకోకతప్పలేదు. AI ఎడమ చేతితో రాస్తున్న మనిషి చిత్రాన్ని రూపొందించలేకపోతుంది. జనరేటివ్ AIని మనం ఏ విధంగా అడిగినా ఎడమ చేతితో మనిషి రాస్తున్న చిత్రాన్ని రూపొందించలేకపోతుంది. ప్రాంప్ట్‌లో ‘ఎడమ చేయి’ అని ప్రస్తావించడం వల్ల, AI ఆ వ్యక్తిని ఎడమ చేతిలో కాఫీ తాగేలా చేసింది. అంతేకానీ ఆ చేతితో పెన్నుపట్టి రాస్తున్నట్లు చూపించే చిత్రాన్ని మాత్రం రూపొందించలేకపోయింది.

ఇవి కూడా చదవండి

అదే వేరే ప్రాంప్ట్‌లో ఎడమ చేతి అని స్పష్టంగా చెబితే.. అది ఒక ఇమేజ్‌ క్రియేట్‌ చేసింది. కానీ అందులో ఓ వ్యక్తి చేతిలో పెన్‌ ఉన్నప్పటికీ అది తన ఎడమ చేతితో రాయడానికి సిద్ధంగా లేదు. అయితే మనిషికి బదులు స్క్రోల్‌పై రాస్తున్న డేగ చిత్రాన్ని రూపొందించడంలో ఇటువంటి సమస్య తలెత్తలేదు. దీనిని బింగ్‌ ఏఐ సృష్టించింది. ఇది ఎంత మూర్ఖంగా అనిపించినా.. ఏఐతో మనిషి ఎడమ చేతితో రాస్తున్న చిత్రాన్ని స్పష్టించడం అసాధ్యంగా మారింది. గ్రోక్ ఏఐ కూడా ఎడమ చేతితో రాస్తున్న మనిషి చిత్రాన్ని రూపొందించడానికి నిరాకరించింది. ఇలా వేర్వేరు ప్రాంప్ట్‌లలో, కుడి చేతితో రాస్తున్న మనిషి చిత్రాలను మాత్రమే వస్తున్నాయి. గ్రోక్ ఉపయోగించే XAI అభివృద్ధి చేసిన కస్టమ్ ఇమేజ్ జనరేటివ్ మోడల్‌కు కూడా అదే సమస్య తలెత్తింది. టెక్స్ట్ సమాధానాలు ఎడమ చేతితో రాస్తున్న మానవ చిత్రాన్ని రూపొందించమని పదే పదే చెప్పినప్పటికీ, అది రూపొందిస్తున్న చిత్రాలలో మాత్రం ఎల్లప్పుడూ కుడి చేయితో రాస్తున్న చిత్రాలనే కాదు, గుహలో డ్రాయింగ్‌ చేస్తున్న ఆది మానవుల చిత్రాలను కూడా సృష్టించట్లేదు. అలాగే కోతి ఎడమ చేతిని ఉపయోగించి పండు తింటున్న చిత్రాన్ని చిత్రీకరించమని అడిగినప్పుడు కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి.

బింగ్ AI లాగా కాకుండా, గ్రోక్ పక్షులు తమ ఎడమ గోళ్లతో రాయడానికి అస్సలు అంగీకరించలేదు. గ్రోక్ పక్షి కోపంగా కాగితం వైపు చూస్తూ, దాని ఎడమ గోళ్లతో రాయడానికి నిరాకరించి, కూర్చుంది. ఇక మెటా AI కి కూడా దాదాపు అదే సమస్య ఎదురైంది. పిలల ఎడమచేతి రాత చిత్రాన్ని రూపొందించమని అడిగితే.. మెటా AI చిన్న బాలిక కుడి చేతితో రాస్తూ ఎడమ చేతితో గోడపై గోకుతున్నట్లు కనిపించింది. ఏఐ టెక్నాలజీలో ఈ ఎడమచేతి వాటం పక్షపాతం ఒక ఆసక్తికరమైన సమస్యగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.