Sasikala AIADMK: సంబంధం లేని వ్యక్తి జెండా ఉపయోగించే అర్హత లేదు.. శశికళపై డీజీపీకి నేతల ఫిర్యాదు

|

Feb 05, 2021 | 10:46 AM

Sasikala AIADMK: అన్నాడీఎంకే బహిషృత నేత శశికళకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరం జరుగుతున్నాయి. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళం ఏర్పాట్లలో మునిగిపోయింది..

Sasikala AIADMK: సంబంధం లేని వ్యక్తి జెండా ఉపయోగించే అర్హత లేదు.. శశికళపై డీజీపీకి నేతల ఫిర్యాదు
Follow us on

– 7న చెన్నైకి రానున్న శశికళ

– హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు

– చిన్నమ్మ పార్టీ జెండా ఉపయోగించకుండా చర్యలు

 

Sasikala AIADMK: అన్నాడీఎంకే బహిషృత నేత శశికళకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరం జరుగుతున్నాయి. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళం ఏర్పాట్లలో మునిగిపోయింది. అయితే హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపిస్తూ చిన్నమ్మకు స్వాగతం పలకనున్నారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌ను సైతం కోరారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి విడుదలైన శశికళ ఈనెల 7న చెన్నైకి రానున్నారు. ఆహ్వాన ఏర్పాట్లు జరుగుతుంటే.. అన్నా డీఎంకే జెండాలతో చిన్నమ్మ వస్తుందేమోనన్న బెంగ పార్టీ వర్గాల్లో నెలకొంది.

జైలు నుంచి విడుదలైన సమయంలో అన్నా డీఎంకే జెండా ఉన్న కారులో శశికళ పయనించిన విషయం తెలిసిందే. దీనిపై ఫిర్యాదులు సైతం వచ్చాయి. తమ పార్టీ జెండా ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూధన్‌, సంయుక్త కన్వీనర్‌ కేపీ మునుస్వామి, వైద్య లింగం, మంత్రులు సీవీ షణ్ముగం, జయకుమార్‌, తంగమణి, వేలుమణి గురువారం సాయంత్రం డీజీపీ త్రిపాఠిని కలిసి ఫిర్యాదు చేశారు. తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీ జెండాను ఉపయోగిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరారు. అన్నాడీఎంకే జెండాలను ఉపయోగించే అర్హత పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఉందని, శశికళకు ఏ మాత్రం లేదని వారు అన్నాడీఎంకే నేతలు స్పష్టం చేశారు.

సంబంధం లేని వ్యక్తి జెండా ఉపయోగించే అర్హత లేదు

సంబంధం లేని వ్యక్తి జెండాను ఉపయోగించే అర్హత లేదని, అందుకే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు కేపీ మునుస్వామి మీడియాకు తెలిపారు. అన్నాడీఎంకే పార్టీ పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని సమన్వయ కమిటీకే చెందుతుందని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని అన్నారు. కోర్టులు సైతం స్పందించాలన్నారు. ఇప్పటికే జయలలిత సమాధి వద్దకు చిన్నమ్మ వెళ్లకుండా పనుల పేరిట అడ్డుకట్ట వేసిన పాలకులు.. తాజాగా జెండా వాడకానికి చెక్‌పెట్టే పనిలో ఉంది.

Also Read:

POCSO Act: పోక్సో చట్టం కింద మూడేళ్లలో 4.12 లక్షల అత్యాచార కేసులు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

India vs England, 1st Test, Day 1 LIVE Score: తొలి టెస్ట్ సమరం.. ఆచితూచి ఆడుతోన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..