Maha Kumbh Mela: ఒళ్లంతా విషసర్పాలు.. బుసలు కొడుతోన్న పాములు.. కుంభమేళాకు అఘోరా..!

ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాకు భక్తుల తాకిడి కొనసాగుతోంది. సాధారణ భక్తజనంతో పాటు సాధు ,సంతువులతో అధ్యాత్మిక నగరి కిటకిలాడుతోంది. మరోవైపు అవాంఛనీయ ఘటనలు జరగకుండా..మరిన్ని చర్యలు చేపట్టారు..పోలీసులు. అయితే తాజాగా ఓ అఘోరా ఒళ్లంతా విష సర్పాలతో కుంభమేళాకు వచ్చినట్లుగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Maha Kumbh Mela: ఒళ్లంతా విషసర్పాలు.. బుసలు కొడుతోన్న పాములు.. కుంభమేళాకు అఘోరా..!
Aghora With Snakes

Updated on: Jan 18, 2025 | 5:03 PM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళాకు.. భక్తజన ప్రవాహం కొనసాగుతోంది. ఉత్సవాలకు కోట్లాది మంది భక్తులు, సాధువులు, సన్యాసులు తరలి వస్తున్నారు. మహాకుంభమేళాకు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.  ఫిబ్రవరి 26 వరకూ జరగనున్న మహాకుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ప్రస్తుత రద్దీ చూస్తుంటే..ప్రభుత్వం ఊహించిన దానికంటే అధికంగానే భక్తులు కుంభమేళాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.  144 ఏళ్ల తర్వాత జరుగుతున్న భారీ కుంభమేళా కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.

మహా కుంభమేళాను పురస్కరించుకుని వస్తోన్న భక్తుల తాకిడితో ప్రయాగ్‌రాజ్‌తో పాటు పరిసర ప్రాంతాలూ రద్దీగా మారాయి. శృంగ్వేర్‌పూర్, చిత్రకూట్, వారణాసి, మా వింధ్యవాసిని ధామ్, నైమిశారణ్య, అయోధ్య వంటి పుణ్య క్షేత్రాలకూ సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు భారీగా తరలివస్తున్న జనంతో.. శాంతి భద్రతల్ని కాపాడటం ప్రయాగ్ రాజ్ పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలో..అనుమతి లేకుండా కార్యక్రమాలు, ఊరేగింపు, నిరాహారదీక్ష, ధర్నా, ప్రదర్శనలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.

కాగా.. దేశంలోని 13 అఖాడాల నుంచి సాధువులు, యోగులు, బాబాలు, అఘోరీలు ఈ కుంభమేళాకు తరలివస్తున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ అఘోరీకి సంబంధించిన షాకింగ్ వీడియో వైర‌ల్‌గా మార‌డంతో అది చూసిన ప్ర‌జ‌లు షాక్‌కు గుర‌వుతున్నారు. ఒంటి నిండా విషసర్పాలు, పుర్రెలతో ఆయన కుంభమేలాలో హల్‌చల్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ వీడియో అక్కడిదేనా అన్న విషయంపై స్పష్టత లేదు.

ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ అఘోరీ బాబా ఎక్కడి నుంచి వచ్చారు.. ఆయనపై ఉన్న పాములు విషం తీసినవా? విషం తీయకపోయినా కాటు వేస్తే ఆయనకు ఏం కాదా ? అసలు ఇది కుంభమేలాలోనే జరిగిందా..? అని చాలా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఆ వీడియోలో ఆ అఘోరీ బాబాపై ఆ పాములు బుసలు కొట్టడం కూడా చూడవచ్చు.  అయితే ఈయన నిజంగానే అక్కడికి వచ్చారా అన్న విషయంపై స్పష్టత లేనప్పటికీ..  వింతైన అఘోరీలు, సాధువులు కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి