Mamata Banerjee Photo Viral: పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో గెలిపించిన మమతాబెనర్జీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు పశ్చిమబెంగాల్‌లో కమ్యూనిస్టు కోట బద్దలు కొట్టిన మమతా తాజా ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటారు. 2016 కంటే కూడా ఎక్కువ స్థానాల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికారం చేజిక్కించుకున్నారు. నంద్రిగ్రామ్ ఓటమిని ఆమె లైట్ తీసుకున్నారు. ఈ విజయం ఆమె సోషల్ మీడియాలోనూ స్టార్‌ను చేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఆమె గెలుపు దాదాపు ఖాయమైన తర్వాత 1980 నాటి మమతా బెనర్జీ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్విటర్‌లో ఇండియన్‌హిస్టరీపిక్స్ అనే హ్యాండిల్ ఈ ఫోటోను పోస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె ఆకాశానికెత్తుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందిరాగాంధీ తర్వాత భారత రాజకీయాలను శాసించిన మహిళ మమతా బెనర్జీనే అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాజకీయ చరిత్రలో ఆమెకు ప్రత్యేకంగా ఒక పేజీ ఉంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Mamata Banerjee In 1980s pic.twitter.com/tM36UhIrwG
— indianhistorypics (@IndiaHistorypic) May 2, 2021