Telangana Governor: ప్రధానికి రిపోర్ట్ కార్డు ఇవ్వడం నా పని కాదు.. రాజ్‌భవన్‌కు గౌరవమివ్వాలన్న గవర్నర్ తమిళిసై..

|

Apr 06, 2022 | 4:43 PM

తాను ఫ్రెండ్లీ గవర్నర్‌ అంటూ స్పష్టం చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గవర్నర్‌ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో..

Telangana Governor: ప్రధానికి రిపోర్ట్ కార్డు ఇవ్వడం నా పని కాదు.. రాజ్‌భవన్‌కు గౌరవమివ్వాలన్న గవర్నర్ తమిళిసై..
Telangana Governor Tamilisa
Follow us on

తాను ఫ్రెండ్లీ గవర్నర్‌ అంటూ స్పష్టం చేశారు తెలంగాణ గవర్నర్(Telangana Governor) తమిళిసై సౌందరరాజన్(Tamilisai Soundarajan). గవర్నర్‌ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీతో(PM Modi) జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల విషయంలో చర్చించినట్లు తెలిపారు గవర్నర్. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రధానిని కోరినట్లు తమిళిసై వివరించారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదన్న ఆమె సేవారంగంలో ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తి సేవ చేయలేదని తాను భావించానని అన్నారు. తన అభిప్రాయాన్ని మాత్రమే ప్రభుత్వానికి చెప్పానని వెల్లడించారు. అయితే.. తమిళిసైకి గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ.. రాజ్‌భవన్‌కు గౌరవమివ్వాలని అన్నారు. గవర్నర్ పర్యటనలకు వెళ్తే వెంట ఎస్పీ, కలెక్టర్ రాకపోవడం అవమానించినట్టు కాదా..? అంటూ ప్రశ్నించారు.

అధికారుల వైఖరిపై నేను ఏ సమస్యను సృష్టించాలనుకోవడం లేదన్నారు. నేనేం వివాదాస్పదం చేయలేదంటూ.. తాను చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. అధికారులను హాజరు కాకుండా ఆదేశాలు జారీ చేయడం.. ప్రొటోకాల్ అమలు చేయకపోవడం సరైన చర్యేనా..? అంటూ ప్రశ్నించారు గవర్నర్. ఈ తరహా ఉల్లంఘనలు సరైనవో కావో అన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధానికి రిపోర్ట్ కార్డు ఇవ్వడం నా పని కాదంటూ తేల్చి చెప్పారు. రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ విషయాలు ఎవరితో చర్చించాల్సిన పనిలేదన్నారు.

ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత సీఎస్‌కు ఉందన్న గవర్నర్.. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. తనను ఎవరూ అవమానించలేదని.. తనకు ఎలాంటి ఈగోలు లేవని స్పష్టం చేశారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని.. వివాదాలు కోరుకోవట్లేదంటూ వెల్లడించారు. తాను ఫ్రెండ్లీ గవర్నర్‌ను అని మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు తాను ప్రధానిని కలవలేదని తమిళిసై సౌందరరాజన్‌ వివరణ ఇచ్చారు.

ఒక డాక్టర్‌గా దేశంలో భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పానని.. పుదుచ్చేరి తెలంగాణ మధ్య అన్ని రకాల పర్యాటక అవకాశాలను పరిశీలించామన్నారు. వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నాను. అందుకోసం రెండు ప్రాంతాల మధ్య విమాన సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.


తెలంగాణలో ట్రైబల్ టూర్‌పై చర్చించినట్లుగా వెల్లడించారు. తెలంగాణలో 11 శాతం గిరిజనలు ఉన్నారు. వారి ప్రగతికి కూడా చర్యలు తీసుకుంటాం.- తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్
రాజ్‌భవన్‌కు ఎవరైనా రావొచ్చు, సమస్యలు తన దృష్టికి తీసుకురావొచ్చని గవర్నర్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి: MIM Corporator: ఎంఐఎం కార్పొరేటర్‌ గౌస్‌ అరెస్ట్‌.. మంత్రి కేటీఆర్‌ సూచనతో స్పందించిన పోలీసులు

Telangana University: తెలంగాణ యూనివర్సిటీ క్యాంటిన్ టిఫిన్‌లో కప్ప.. విద్యార్థుల ఆందోళన..