West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతుండటంపై స్పందించిన ఆయన.. మమతా బెనర్జీకి కీలక సూచనలు చేశారు. బీజేపీని అడ్డుకోవాలంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ గొడుగు కిందకు రావాలని అన్నారు. ఆమెకు అది మినహా మరో ప్రత్యామ్నాయం లేదని అధీర్ రంజన్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి టీఎంసీ కలిసి పని చేస్తే బీజేపీని సులువుగా అడ్డుకోవచ్చునని అన్నారు. కాంగ్రెస్ పార్టీ.. బీజేపీని ఎదుర్కొంటూ దేశంలో సెక్యులరిజాన్ని కాపాడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌తో జత కట్టాలని మమతా బెనర్జీ కూడా భావిస్తున్నట్లయితే.. ఆ విషయాన్ని చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కోవడం టీఎంసీ వల్ల కాదని వ్యాఖ్యానించిన అధీర్ రంజన్.. కాంగ్రెస్ సహాయంతోనే టీఎంసీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.
Also read: