Booster Dose: ఎల్లుండి నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్.. ముందుకొచ్చిన కొవిషీల్డ్.. ధరెంతంటే

ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా(Corona) వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నా.. భారతదేశంలో మాత్రం కొవిడ్ విస్తృతి తక్కువగా ఉంది. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడంతో కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు....

Booster Dose: ఎల్లుండి నుంచి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్.. ముందుకొచ్చిన కొవిషీల్డ్.. ధరెంతంటే
Covieshield

Updated on: Apr 08, 2022 | 7:53 PM

ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా(Corona) వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నా.. భారతదేశంలో మాత్రం కొవిడ్ విస్తృతి తక్కువగా ఉంది. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడంతో కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు డోసుల టీకా తీసుకున్నా మెరుగైన రక్షణ కోసం బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్‌ లేదా బూస్టర్ డోసు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా స్వాగతించారు. బూస్టర్‌(Booster) డోసు తీసుకోని వారిని చాలా దేశాలు అనుమతించని పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. బూస్టర్‌ డోసు వినియోగానికి అనుమతించిన తర్వాత కొవిషీల్డ్‌(Covishield) డోసు ధర రూ.600 కే అందుబాటులోకి తెస్తామన్నారు. దీనితోపాటు కొవావాక్స్‌ బూస్టర్‌ డోసు ధర రూ.900 తో పాటు, వీటికి పన్నులు అధికంగా ఉంటాయని అదర్‌ పూనావాలా వెల్లడించారు.

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్‌ 10వ తేదీ ప్రికాషన్ డోసు పంపిణీ చేయనుంది. ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో మాత్రమే బూస్టర్ డోసు పంపిణీ చేయనుంది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తైన వారందరూ ఈ డోసు టీకా తీసుకోవచ్చు. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో బూస్టర్ డోసు కూడా అదే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రస్తుతమున్న తొలి, రెండు డోసుల పంపిణీ అలాగే కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు.. దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 1,109‬ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 43 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 12 వేల దిగువకు పడిపోయింది. 1,213 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.76 శాతంగా నమోదైంది.

Also Read

Viral Photo: ఈ చిన్నారులిద్దరు స్టార్ హీరోస్.. యూత్‏లో యమ ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టండి..

The Ghost Movie: స్పీడ్ పెంచిన నాగార్జున.. ది ఘోస్ట్ కొత్త షెడ్యూల్ ప్రారంభం..

Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ తేదీల్లో వాటర్ సప్లై బంద్.. కారణమిదే