Viral Photo: ఈ చిన్నారులిద్దరు స్టార్ హీరోస్.. యూత్‌లో యమ ఫాలోయింగ్.. ఎవరో గుర్తుపట్టండి..
ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన స్టార్లను గుర్తుపట్టేందుకు
ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన స్టార్లను గుర్తుపట్టేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారుల ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోలో అందంగా నవ్వుతూ కనిపిస్తున్న ఆ చిన్నారులు ఎవరో గుర్తుపట్టండి. ఈ ఇద్దరు చిన్నారులు ఇప్పుడు స్టార్ హీరోస్.. యూత్‌లో యమ ఫాలోయింగ్.యాక్షన్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తాజాగా ఈ ఇద్దరూ ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. గుర్తుపట్టండి. ఇద్దరూ అన్నదమ్ముల్లు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథనాయకులుగా తమ కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఎవరో గుర్తుపట్టండి.
ఆ ఇద్దరు చిన్నారులు మరెవరో కాదండోయ్.. మెగా హీరోస్ వరుణ్ తేజ్.. రామ్ చరణ్. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్… అల్లూరి సీతారామారాజు పాత్రలో నటించి అదరగొట్టాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి దూసుకుపోతుంది. ఇక వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన గని సినిమా ఈరోజు విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం చరణ్.. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
View this post on Instagram
Also Read: Bloody Mary: బ్లడీ మేరీ మేకింగ్ వీడియో రిలీజ్.. అంధురాలిగా నివేదా పేతురాజ్..
Manchu Vishnu: సన్నీ లియోన్‌ను చూసి భయపడి పారిపోయిన మంచు విష్ణు.. నెట్టింట్లో వైరలవుతున్న వీడియో..
Akira Nandan: అకీరాకు బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్..