Adani Group – Hindenburg: హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాల్లేవ్.. అదానీ గ్రూప్‌కి సుప్రీం కమిటీ క్లీన్ చిట్..

|

May 19, 2023 | 3:25 PM

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తేల్చి చెప్పింది. స్టాక్ రేట్లు పెంచి చూపించినట్లుగా హిడెన్ బర్గ్ ఆరోపించినట్లుగా అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవంది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడుల్లో

Adani Group - Hindenburg: హిండెన్‌బర్గ్ ఆరోపణలకు ఆధారాల్లేవ్.. అదానీ గ్రూప్‌కి సుప్రీం కమిటీ క్లీన్ చిట్..
Adani
Follow us on

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తేల్చి చెప్పింది. స్టాక్ రేట్లు పెంచి చూపించినట్లుగా హిడెన్ బర్గ్ ఆరోపించినట్లుగా అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవంది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడుల్లో ఎలాంటి మోసం జరుగలేదని తేల్చింది. నిపుణుల కమిటీ రిపోర్ట్‌తో అదానీకి భారీ ఊరట లభించినట్లయ్యింది. ఒక్కసారిగా అదానీ షేర్ల విలువ పెరిగింది. కాగా, సుప్రీంకోర్టు నియమించిన ఈ కమిటీలో నందన్ నీలేకని సహా ఇతర ప్రముఖులు ఉన్నారు. ఈ నిపుణులు కమిటీతో అదానీకి భారీ ఊరట లభించినట్లయ్యింది.

అదానీ గ్రూప్‌పై హిండెన్ ‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. స్టాక్ రేట్లను పెంచి చూపించినట్లు, అదానీ షేర్లన్నీ బూటకమే అని ఆరోపించింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపింది. విషయం సుప్రీంకోర్టుకు చేరింది. దాంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నందన్ నీలేకని నేతృత్వంలో నిపుణుల కమిటీ నియమించింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో నిజానిజాలపై నిగ్గు తేల్చాలని ఆదేశించింది. దాంతో విచారణ చేపట్టిన కమిటీ.. తాజాగా నివేదికను సుప్రీంకోర్టుకు అందజేసింది. ఈ నివేదికలో స్టాక్ ధరల నియంత్రణలో వైఫల్యం జరిగిందని చెప్పలేమని, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారలు లేవని కమిటీ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..