Aamir Khan Add: బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన యాడ్‌పై బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే అభ్యంతరం వ్యక్తంచేశారు. హిందువుల్లో అశాంతిని కల్పించే బదులు.. అన్నింటిపై అవగాహన కల్పించాలంటూ కర్ణాటకకు చెందిన ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే సూచించారు. టైర్ల కంపెనీ సియెట్ రూపొందించిన యాడ్‌లో.. ఆమీర్ ఖాన్ రోడ్లపై టపాసులు కాల్చవద్దంటూ ప్రజలను కోరుతుంటాడు. అయితే.. ఈ యాడ్ హిందువుల్లో అశాంతిని సృష్టించేలా ఉందంటూ ద సియట్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అనంత్ వర్ధన్ గోయంకాకు 14వ తేదీన ఎంపీ హెగ్డే లేఖ రాశారు. ఎంపీ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. మీ కంపెనీ ఇటీవల ప్రకటించిన ప్రకటనలో అమీర్ ఖాన్ వీధుల్లో పటాకులు కాల్చకండి అంటూ ప్రజలకు సలహా ఇస్తున్నారు. ప్రజా సమస్యలపై మీ స్పందనకు ధన్యవాదాలు. దీంతోపాటు రోడ్లపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.
శుక్రవారం, ముఖ్యమైన పండుగలప్పుడు నమాజ్ పేరుతో రోడ్లను బ్లాక్ చేయడం, మసీదుల నుంచి వచ్చే భారీ శబ్ధాల వంటి సమస్యల గురించి కూడా కంపెనీ ప్రస్తావించాలని కోరారు. నమాజ్ సమయంలో రోడ్లను బ్లాక్ చేస్తారని.. అప్పుడు అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వంటివి ట్రాఫిక్‌లో గంటలకొద్ది నిలిచిపోతున్నాయని హెగ్డే తెలిపారు. అమీర్ ఖాన్ నటించిన ఈ యాడ్‌తో హిందువుల్లో అలజడి రేగుతోందంటూ లేఖలో వివరించారు. రాబోయే రోజుల్లో హిందువుల మనోభావాలను కంపెనీ గౌరవిస్తుందని ఆశిస్తున్నానంటూ ఎంపీ లేఖలో వివరించారు. అయితే.. ఎంపీ అనంతకుమార్ హెగ్డే అభ్యంతరం వ్యక్తం చేయడంతో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన యాడ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
వివాదాస్పదంగా మారిన యాడ్ ఇదే..
Also Read: