Raadika: నటి రాధిక ఆస్తుల విలువెంతో తెలుసా.? అప్పులు కూడా..

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని విరుదునగర్‌ నుంచి బరిలోకి దిగుతున్న నటి రాధికా శరత్‌ కుమార్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈమె బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు...

Raadika: నటి రాధిక ఆస్తుల విలువెంతో తెలుసా.? అప్పులు కూడా..
Actress Radhika

Updated on: Mar 26, 2024 | 3:51 PM

సార్వత్రిక ఎన్నికలకు ఇలా షెడ్యూల్‌ విడుదలైందో లేదో ఇలా సందడి మొదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే మొదటి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామపత్రాలను సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని విరుదునగర్‌ నుంచి బరిలోకి దిగుతున్న నటి రాధికా శరత్‌ కుమార్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈమె బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో దాఖలు చేసిన నామినేషన్‌లో తన ఆస్తుల వివరాలను ప్రకటించిచారు.

వీటి ప్రకారం రాధి తన మొత్తం ఆస్తుల విలువలను రూ. 53.45 కోట్లుగా ప్రకటించారు. వీటిలో రూ.33.01లక్షల నగదు, 75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలు, వస్తువులతో కలిపి రూ.27.05కోట్ల చరాస్తులున్నట్లు తెలిపారు. ఇక తనకు రూ. 26.40 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని ఆమె ప్రకటించారు. అలాగే రాధికకు రూ. 14.79 కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే రాధిక ప్రస్తుతంరాడాన్‌ మీడియా వర్క్స్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. కాగా రాధిక భర్త హీరో శరత్‌ కుమార్‌ తన ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి పార్టీని బీజేపీలో విలీనం చేసిన నేపథ్‌యంలో రాధికకు విరుదునగర్‌ సీటను ఇచ్చారు. రాధ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..