చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. బిగ్‌బాస్ సీజన్ 14 కంటెస్టెంట్, నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాు సోనాలి ఫోగట్ మృతి చెందారు. సోమవారం రాత్రి గోవాలోని ఆమె గుండెపోటుతో మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల కొందరు సిబ్బందితో కలిసి 43 ఏళ్ల సోనాలి గోవా వెళ్లింది. సోనాలి మృతి పట్ల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని ఫతేహాబాద్‌లోని భూథాన్ గ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో సోనాలి జన్మించారు. ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా నుంచి అడంపూర్ నియోజకవర్గం నుంచి బిజేపి టికెట్ పై ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారిన కుల్దీప్ బిష్ణోయ్ పై పోటీ చేసింది.
సోనాలి ఫోగట్ బిగ్ బాస్ 14 కంటెస్టెంట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు.. ఆమెకు టిక్‌టాక్‌లో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చనిపోవడానికి కొన్ని గంటల ముందు తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో ఓ వీడియో షేర్ చేసుకున్నారు. మొహమ్మద్ రఫీ పాట అయిన రుఖ్ సే జరా నికాబ్ తో హతా దే మేరే హజూర్ సాంగ్ పోస్ట్ చేశారు.