Actor Sonu Sood: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సోనూ సూద్ కీలక ప్రకటన.. ఇంతకీ ఏమన్నారంటే..?

|

Nov 14, 2021 | 1:10 PM

కరోనా టైమ్‌లో సోనూ సూద్ చాలా సేవ చేశారు. సాయం అంటే సోనూ సూద్.! సోనూ సూద్ అంటే సాయం అన్న రేంజ్‌లో మార్మోమోగింది. ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గానూ నియమించింది. రీల్‌ లైఫ్ విలన్ రియల్ లైఫ్ హీరో అయ్యాడు!

Actor Sonu Sood: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సోనూ సూద్ కీలక ప్రకటన.. ఇంతకీ ఏమన్నారంటే..?
Sonu Sood
Follow us on

Actor Sonu Sood on Politics: కరోనా టైమ్‌లో సోనూ సూద్ చాలా సేవ చేశారు. సాయం అంటే సోనూ సూద్.! సోనూ సూద్ అంటే సాయం అన్న రేంజ్‌లో మార్మోమోగింది. ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గానూ నియమించింది. రీల్‌ లైఫ్ విలన్ రియల్ లైఫ్ హీరో అయ్యాడు! స్టార్‌హీరోలకు లేని క్రేజ్ సొంతమైంది. సెలబ్రెటీలు సైతం సాహో అన్నారు. వెల్‌డన్‌ అంటూ అప్రిషియేట్ చేశారు..! తన ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి నిరుపేదల కోసమే వెచ్చిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పేదలకు సేవ చేయడం కోసం కొన్ని బ్రాండ్స్‌ను కూడా ప్రోత్సహించానని ప్రకటించారు.

తన అద్భుతమైన నటనతో పాటు కొవిడ్‌ సమయంలో విశేష సేవాకార్యక్రమాలతో ప్రజాఆదరణ పొందిన సోనూ సూద్‌ ఆదివారం కీలక ప్రకటన చేశారు. తన సోదరి మాళవిక సూద్‌ రాబోయే పంజాజ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరనున్నారనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు.‘‘మాళవిక పోటీకి సిద్ధమయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిది. రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయంలో ప్రకటిస్తాం’’ అని మోగాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సోనూ సూద్‌ ప్రకటించారు.

సోనూ సూద్‌ ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవలే పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని కలిశారు. గతంలో సోనూ సూద్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే దిల్లీ ప్రభుత్వం చేపట్టిన ‘దేశ్‌ కా మెంటార్స్‌’ అనే కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో తన సోదరి మాళవికా సూద్ పోటీకి దింపేందుకు సోనూ సూద్ సిద్ధమయ్యారు. తనను రాజకీయ నాయకులు, పార్టీలు సన్మానించినప్పటికీ, తన స్వచ్ఛంద సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదని సోనూసూద్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు. తాజాగా ఎన్నికల్లో కుటుంబసభ్యులను బరిలోకి దింపడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన నిస్సహాయంగా ఉన్న వందలాది మంది వలసదారులను వారి స్వంత రాష్ట్రానికి తీసుకెళ్లడానికి సోనూ సూద్ బస్సులు, రైళ్లు, విమానాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రెండవ వేవ్ సమయంలో, అతను కోవిడ్ రోగులకు ఆక్సిజన్‌ను సరఫరా చేశారు. యాక్టింగ్ నుంచి సేవా కార్యక్రమాలు, తాజా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న సోనూ సూద్ ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి.

Read Also… Viral Video: ఓరి దేవుడా! కళ్ల ముందే ఇల్లు కాలిపోతుంటే.. నవ్వుతూ ఫేస్‌బుక్‌లో లైవ్ షో..!