PM Modi Security Breach: మరోసారి తెరపైకి ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం.. అప్పటి ఐపీఎస్ అధికారులపై చర్యలకు ఆదేశాలు..

|

Mar 21, 2023 | 6:15 AM

Punjab: ప్రధాని మోడీ భద్రతలో లోపానికి పంజాబ్‌లోని చాలా మంది ఐపీఎస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవచ్చు. విచారణ నివేదిక మేరకు ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది.

PM Modi Security Breach: మరోసారి తెరపైకి ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం.. అప్పటి ఐపీఎస్ అధికారులపై చర్యలకు ఆదేశాలు..
Pm Modi Security Breach
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం పెద్ద చర్య తీసుకుంది. అప్పటి డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ, ఫిరోజ్‌పూర్ డీఐజీ ఇంద్రబీర్ సింగ్, అప్పటి ఎస్ఎస్పీ హర్మన్‌దీప్ హన్స్‌లపై కఠిన శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు పంజాబ్‌కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులపై కూడా ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోనున్నారు.

అప్పటి లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ నరేష్ అరోరా, సైబర్ క్రైమ్ ఏడీజీపీ నాగేశ్వర్ రావు, ఐజీపీ పాటియాలా రేంజ్ ముఖ్వీందర్ సింగ్, ఐజీ కౌంటర్ ఇంటెలిజెన్స్ రాకేష్ అగర్వాల్, డీఐజీ ఫరీద్‌కోట్ సూర్జిత్ సింగ్, ఎస్ఎస్పీ మోగా చరణ్‌జిత్ సింగ్‌ల నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. విచారణ కమిటీ సిఫార్సు చేసిన విధంగా వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

నివేదికలో ఏముంది?

ప్రధాని భద్రతలో లోపాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 6 నెలల క్రితం సమర్పించిన విచారణ కమిటీ నివేదికలో, ప్రధానమంత్రి భద్రతలో లోపానికి అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిరుధ్ తివారీ, పోలీసు చీఫ్ ఎస్ ఛటోపాధ్యాయ, ఇతర ఉన్నతాధికారులు బాధ్యులుగా పేర్కొన్నారు. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పంజాబ్ చీఫ్ సెక్రటరీ విజయ్ కుమార్ జంజువాను చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

ఈ నివేదికలో, పంజాబ్ పోలీసు అధికారులు నిర్లక్ష్య వైఖరికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సంఘటన ప్రణాళిక, సమన్వయంలో ఘోర వైఫల్యంగా అభివర్ణించారు. పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రతలో లోపభూయిష్టమైన విషయం వెలుగులోకి వచ్చిన సమయంలో, ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

విషయం ఏమిటి?

ప్రధాని నరేంద్ర మోదీ 5 జనవరి 2022న పంజాబ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా, ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను ఓ గ్రామంలోని వంతెనపై రైతులు అడ్డుకున్నారు. దీని తర్వాత ప్రధానమంత్రి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..