Yogi Adityanath: యోగి పాలనలో యూపీలో తగ్గిన నేరాలు.. NCRB నివేదికలో ఆసక్తికర విషయాలు..

అదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో నేరాల సంఖ్య పెరిగినట్లు జాతీయ నేర గణంకాల సంస్థ తెలిపింది. ఈ రాష్ట్రంలో నేరాల సంఖ్య 44 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే 2018 నుంచి 2022 వరకు దేశ వ్యాప్తంగా మతపరమైన అలర్ల సంఘటనలు 34 శాతం తగ్గాయని నివేదికలో తేలింది. 2021లో సగటున మతపరమైన అల్లర్లు 378 ఉండగా, 2022 నాటికి 272కి తగ్గాయి. 2022లో మధ్యప్రదేశ్‌లో 68, బీహార్‌లో 60, జార్ఖండ్‌లో 46 మతపరమైన అల్లర్లు...

Yogi Adityanath: యోగి పాలనలో యూపీలో తగ్గిన నేరాలు.. NCRB నివేదికలో ఆసక్తికర విషయాలు..
NCRB

Updated on: Dec 05, 2023 | 2:40 PM

ఉత్తరప్రదేశ్‌లో నేరాలు భారీగా తగ్గినట్లు జాతీయ నేర గణంకాల సంస్థ (NRCB) తెలిపింది. ఈ సంస్థ గణంకాల ప్రకారం 2022లో యూపీలో అల్లర్లు జరగలేదని తేలింది. అదే సమయంలో గడిచిన ఐదేళ్లలో నేరాలు ఏకంగా 50 శాతం తగ్గాయని ఎన్‌ఆర్‌సీబీ తెలిపింది. ఇక అస్సాంలో సైతం అల్లర్లు తగ్గుముఖం పట్టాయని నివేదికలో తేలింది. ఇక్కడ ఏకంగా 80 శాతం నేరాలు తగ్గాయి.

అదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో నేరాల సంఖ్య పెరిగినట్లు జాతీయ నేర గణంకాల సంస్థ తెలిపింది. ఈ రాష్ట్రంలో నేరాల సంఖ్య 44 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే 2018 నుంచి 2022 వరకు దేశ వ్యాప్తంగా మతపరమైన అలర్ల సంఘటనలు 34 శాతం తగ్గాయని నివేదికలో తేలింది. 2021లో సగటున మతపరమైన అల్లర్లు 378 ఉండగా, 2022 నాటికి 272కి తగ్గాయి. 2022లో మధ్యప్రదేశ్‌లో 68, బీహార్‌లో 60, జార్ఖండ్‌లో 46 మతపరమైన అల్లర్లు జరిగినట్లు నివేదకలో తేలాయి. అయితే యూపీలో మాత్రం ఇలాంటి ఒక్కటి సంఘటన జరగకపోవడం విశేషం.

ఇక గతేడాది దేశంలోనే అత్యధిక రాజకీయ అల్లర్లు కేరళలో జరిగాయి. ఇక్కడ 301 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే ఒడిశాలో 224, మహారాష్ట్రలో 86 అల్లర్లు జరిగాయి. 2018 -2022 మధ్య ఎన్‌సిఆర్‌బి క్రైమ్ డేటాను రాష్ట్రాల వారీగా పోల్చి చూస్తే దేశంలో హత్యలు తగ్గుముఖం పట్టాయి. ఇదిల ఉంటే గడిచి 5 ఏళ్లలో మహిళలపై అత్యధికంగా దాడులు జరిగిన రాష్ట్రాల్లో రాజస్థాన్ (61.7%), తమిళనాడు (58.1%)లో చోటు చేసుకున్నాయి.

అస్సాంలో మాత్రం మహిళలపై దాడులు 50 శాతం తగ్గాయి. ఇక 2018-2022 మధ్య భారతదేశంలో అత్యాచార కేసులు 5.5% తగ్గాయి, అస్సాం, మధ్యప్రదేశ్‌లలో క్షీణత రేటు చాలా ఎక్కువగా ఉంది. అస్సాంలో 32.5 శాతం, మధ్యప్రదేశ్‌లో 44.2 శాతం తగ్గుముఖం పట్టాయి. మరోవైపు బిహార్‌లో 35.3 శాతం అత్యాచార కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో అత్యాచార కేసులు 34.3 శాతం తగ్గాయి, రాజస్థాన్‌లో 24.5 శాతం తగ్గుముఖం పట్టాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..