రైతు ఉద్యమానికి సంఘీభావం… నిరాహార దీక్షతో నిరసన తెలుపనున్న ఆమ్ ఆద్మీ పార్టీ…

| Edited By:

Dec 13, 2020 | 3:40 PM

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైలు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతల నిరసనలు 18వ రోజుకు చేరుకున్నాయి.

రైతు ఉద్యమానికి సంఘీభావం... నిరాహార దీక్షతో నిరసన తెలుపనున్న ఆమ్ ఆద్మీ పార్టీ...
Follow us on

కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైలు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతల నిరసనలు 18వ రోజుకు చేరుకున్నాయి. కేంద్ర వైఖరిని నిరసిస్తూ… రైతులు డిసెంబర్ 14న పెద్ద ఎత్తున ధర్నాలు, టోల్ ప్లాజాల వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ రైతుల ఆందోళనకు మద్దతు పలికింది…

ఆమ్ ఆద్మీ శ్రేణుల నిరాహార దీక్షలు…

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ నీటి పారుదల, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతు ఆందోళనలకు ఏఏపీ మద్దతు ఇస్తోందని అన్నారు. పార్టీ శ్రేణులు డిసెంబర్ 14న నిరాహార దీక్ష చేస్తూ రైతులకు సంఘీభావం తెలుపుతారని వివరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.