AAP vs BJP: ఢిల్లీలో పొలిటికల్‌ దంగల్‌.. ఢీ అంటే ఢీ అంటోన్న ఆప్‌, బీజేపీ నేతలు

|

Aug 31, 2022 | 8:55 PM

Delhi Politics: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ - ఆప్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాటలయుద్ధం మాత్రమే కాదు వీధిపోరాటాలకు కూడా దిగుతున్నారు ఇరుపార్టీల నేతలు. స్కూళ్ల నిర్మాణంలో అవినీతి అంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు.

AAP vs BJP: ఢిల్లీలో పొలిటికల్‌ దంగల్‌.. ఢీ అంటే ఢీ అంటోన్న ఆప్‌, బీజేపీ నేతలు
Aap Vs Bjp
Follow us on

Delhi Politics: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ – ఆప్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మాటలయుద్ధం మాత్రమే కాదు వీధిపోరాటాలకు కూడా దిగుతున్నారు ఇరుపార్టీల నేతలు. స్కూళ్ల నిర్మాణంలో అవినీతి అంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. మరోవైపు ఆప్‌ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి చేసిన కుట్రపై దర్యాప్తు చేయాలని సీబీఐ ఆఫీస్‌ను ముట్టడించారు ఆప్‌ ఎమ్మెల్యేలు. ఇలా ఇరు పార్టీల నేతలు బాహా బాహీకి దిగడంతో ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాగా ఢిల్లీలో స్కూళ్ల నిర్మాణంలో అవినీతి జరుగుతోంది బీజేపీ మొదట ఆరోపించింది. ఈ విషయంపై బీజేపీ నేత గౌరవ్‌ భాటియా, ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ మధ్య సవాళ్ల పర్వం నడిచింది. తాము నిర్మించిన ప్రభుత్వ స్కూళ్లకు వచ్చి చూడాలని , అవినీతిని నిరూపించాలని సౌరభ్‌ భరద్వాజ్‌ సవాల్‌ విసిరారు.

ఈ సవాల్‌కు స్పందించిన గౌరవ్‌ భాటియా ప్రభుత్వ స్కూల్‌ను సందర్శించడానికి వచ్చినప్పుడు గొడవ జరిగింది. 1960లో నిర్మించిన స్కూల్‌ను చూపించి తాము నిర్మించినట్టు కేజ్రీవాల్‌ ప్రచారం చేసుకుంటున్నారని గౌరవ్‌ భాటియా విమర్శించారు. స్కూల్‌ కొత్త బ్లాక్‌ లోకి వచ్చి చూస్తే అసలు విషయం తెలుస్తుందని గౌరవ్‌ భరద్వాజ్‌ కౌంటర్‌ ఇచ్చారు. అయితే స్కూల్‌ లోపలికి రాకుండానే గౌరవ్‌ భాటియా వెనక్కి వెళ్లిపోయారు. కారు నుంచి దిగకుండానే భాటియా పారిపోయారని ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ విమర్శించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గౌరవ్‌భాటియా కారు వైపు ఆప్‌ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఢిల్లీలో 500 స్కూళ్లను నిర్మించినట్టు ఆప్‌ ప్రచారం చేసుకుంటుందన్నారు గౌరవ్‌ భాటియా. కొత్త స్కూళ్ల పేరుతో అవినీతి పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే తాము కట్టిన స్కూళ్లను చూడడానికి గౌరవ్‌ భాటియా ఇష్టపడడం లేదని , అందుకే పారిపోయారని ఆప్‌ కౌంటరిచ్చింది.

ఇవి కూడా చదవండి

ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు..

మరోవైపు ఢిల్లీలో ఆప్‌ ఎమ్మెల్యేలు సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఆపరేషన్‌ లోటస్‌పై వెంటనే దర్యాప్తు చేయాలని ఆప్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఇచ్చి కొనేందుకు ప్రయత్నించిందని ఆప్‌ నేతలు ఆరోపించారు. తమ వినతి పత్రాన్ని తీసుకోవడానికి సీబీఐ డైరెక్టర్‌ ముందుకు రాలేదన్నారు ఆప్‌ ఎమ్మెల్యే ఆతిషి. ఆప్‌ ఎమ్మెల్యేల నిరసన తరువాత సీబీఐ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించారు. ఇక నోట్లరద్దు సందర్భంగా జరిగిన స్కాంలో తన ప్రమేయముందని ఆప్‌ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా నిర్ణయించారు. ఆప్‌ ఎమ్మెల్యేలు సౌరభ్‌ భరద్వాజ్‌ , ఆతిషితో సహా మరో ఇద్దరిపై పరువునష్టం దావా వేయాలని ఎల్‌జీ నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..