రాహుల్ గాంధీ ధర్నాపై ఆప్ నేత సంచలన వ్యాఖ్యలు.. సంజయ్ ఆరోపణలతో రాజకీయ దుమారం!

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి నివాసం ఎదుట చేపట్టాల్సిన నిరసనను బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడితో రాహుల్ గాంధీ తన నివాసంలోనే ధర్నాకు పరిమితమయ్యారని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.

రాహుల్ గాంధీ ధర్నాపై ఆప్ నేత సంచలన వ్యాఖ్యలు.. సంజయ్ ఆరోపణలతో రాజకీయ దుమారం!
Sanjay Singh On Rahul Gandhi

Updated on: Jul 21, 2026 | 6:28 PM

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి నివాసం ఎదుట చేపట్టాల్సిన నిరసనను బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడితో రాహుల్ గాంధీ తన నివాసంలోనే ధర్నాకు పరిమితమయ్యారని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.

అంతకుముందు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలతో కలిసి సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్ భవనం కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే చెందిందని కాదు, దేశ ప్రజలందరికీ చెందిన ప్రజాస్వామ్య వేదిక అని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష గొంతును అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, అలాంటి చర్యలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

మీడియాతో మాట్లాడిన సంజయ్ సింగ్, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును కూడా తప్పుబట్టారు. నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై దాడులు జరిగాయని ఆరోపించారు. అలాగే సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ 22 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనలేదు. కాగా, ఈ పరిణామాల మధ్య పార్లమెంట్‌లో ప్రతిపక్ష-ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us