దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు UIDAI నుంచి కీలక ఆదేశాలు! 5 నుంచి 15 ఏళ్ల పిల్లల..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) 5 నుండి 15 ఏళ్ల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా నవీకరించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు UIDAI CEO లేఖ రాశారు. MBU శిబిరాల కు మద్దతు ఇవ్వాలని కోరారు.

దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు UIDAI నుంచి కీలక ఆదేశాలు! 5 నుంచి 15 ఏళ్ల పిల్లల..
అలాంటి సమాయాల్లో వారి అడ్రస్‌ వంటి మారుతూ ఉంటాయి. దీంతో ఈ ఆధార్ అప్‌డేట్‌ అందుబాటులో ఉండడం వల్ల వారు ఎప్పటికప్పుడూ ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోగులుగుతారు. అలాగే ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి వేలి ముద్రలు, ఐరిస్‌ వంటివి అప్‌డేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ కార్డు పొంది ప్రతి ఒక్కరు పదేళ్లు పూర్తయిన వెంటనే దాన్ని అప్‌డేట్‌ చేసకోవాలని యూఐడీఏఐ చెబుతోంది.

Updated on: Aug 29, 2025 | 11:04 AM

5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్‌ సకాలంలో నిర్ధారించాలని దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఆదేశించింది. UIDAI CEO భువనేష్ కుమార్ ఈ విషయంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. MBU శిబిరాలను నిర్వహించడంలో మద్దతు ఇవ్వాలని కోరారు. దాదాపు 17 కోట్ల మంది పిల్లలకు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ప్లాట్‌ఫామ్‌లో ఆధార్‌లో పెండింగ్‌లో ఉన్న MBU ని సులభతరం చేయడానికి UIDAI, విద్యా మంత్రిత్వ శాఖ కూడా సహకరించాయని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనేది పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ ఆధ్వర్యంలోని విద్యా నిర్వహణ సమాచార వ్యవస్థ, ఇది పాఠశాల విద్యకు సంబంధించిన వివిధ గణాంకాలను సేకరించి, నిర్వహిస్తుంది. UIDAI పాఠశాల విద్యా శాఖ నుండి ఈ ఉమ్మడి చొరవ పిల్లల బయోమెట్రిక్‌లను అప్డేట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి