Ayodhya: అయోధ్యలోని ఆలయంలో హత్య..! గుడిలో నిద్రిస్తున్న యువకుడి గొంతుకోసి హతమార్చిన దుండగులు..!!

ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణ ఘటన వెలుగు చూసింది. అయోధ్యలోని ఆలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతని బంధువులే అతన్ని

Ayodhya: అయోధ్యలోని ఆలయంలో హత్య..! గుడిలో నిద్రిస్తున్న యువకుడి గొంతుకోసి హతమార్చిన దుండగులు..!!
Temple In Ayodhya

Updated on: Jul 03, 2022 | 7:01 PM

Ayodhya Temple: ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో దారుణ ఘటన వెలుగు చూసింది. అయోధ్యలోని ఆలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతని బంధువులే అతన్ని అతి కిరాతంగా గొంతు నులిమి హత్య చేశారు. పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు వ్యక్తి హత్యకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అయోధ్య జిల్లాలోని కుమార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమేథీకి చెందిన పంకజ్ శుక్లా(35) ఇటీవల తన అమ్మమ్మ, తాతయ్య ఊరైన అయోధ్య జిల్లాలోని భూపూర్ గ్రామానికి వచ్చాడు. గత రెండు నెలలుగా అతను ఆ గ్రామంలోనే ఉంటున్నాడు. శనివారం రాత్రి అతనికి తన బంధువు గుల్లు మిశ్రాతో మద్యం మత్తులో గొడవ జరిగిందని తెలిసింది. అందులో శుక్లా తన బంధువును కొట్టాడని అయోధ్య పోలీసు సూపరింటెండెంట్ శైలేష్ పాండే తెలిపారు. అనంతరం గ్రామంలోని హనుమాన్‌ ఆలయం అరుగుపై శుక్లా నిద్రపోయాడు. అయితే తనను కొట్టడాన్ని అవమానంగా భావించిన మిశ్రా దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి శుక్లా నిద్రిస్తున్న ఆలయం వద్దకు వెళ్లాడు… పదునైన ఆయుధంతో శుక్లా గొంతుకోసి అక్కడి నుండి పారిపోయాడు.

ఆ మర్నాడు ఉదయం(ఆదివారం) రక్తపు మడుగులో శుక్లా మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. హత్యకు సంబంధించి గ్రామంలో విచారించిన పోలీసులు.. గోలు మిశ్రాను అరెస్టు చేసినట్టు తెలిపారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us