PM Narendra Modi praised Girl : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనునిత్యం ప్రజా సేవలో బిజిబిజీగా ఉంటారు. ఎప్పుడూ సరికొత్త విషయాల పట్ల ఆయన ఆసక్తితో ఉంటారు. తాజాగా.. ఓ చిన్నారి పాడిన పాట ప్రధాని మోడీని తెగ ఆకట్టుకుంది. చిన్నారి పాడిన ‘అయిగిరి నందిని’ (Aigiri Nandini) స్తోత్రం విన్న ప్రధాని వాహ్.. అంటూ ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. శుక్రవారం గుజరాత్‌కు చెందిన జిల్లా పంచాయతీ అధ్యక్షులు, సభ్యులతో సమావేశం అయ్యారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాని నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా దక్షిణ గుజరాత్‌కు చెందిన ఓ చిన్నారి కుటుంబం ప్రధాని మోదీని కలిసింది. ఈ క్రమంలో చిన్నారి మోదీ ఎదుట అయిగిరి నందిని స్తోత్రాన్ని పాడి ఆకట్టుకుంది. స్తోత్రాన్ని ఒక్కనిమిషంపాటు గుక్క తిప్పుకోకుండా పఠించింది.. ఈ స్తోత్రాన్ని విన్న ప్రధాని మోదీ.. వాహ్ అంటూ ప్రశంసించారు.
ఈ సందర్భంగా చిన్నారి.. చిన్న శివలింగాన్ని ప్రధాని మోదీకి బహూకరించింది. దీంతో ప్రధాని శివలింగాన్ని తీసుకోని ఆమెను ఆశీర్వదించారు.
A little girl from South Gujarat recites Aigiri Nandini ….. stotram before Prime Minister Narendra Modi at 7 Lok Kalyan Marg residence of PM in national capital New Delhi during PM Modi’s meeting with District Panchayat presidents and members from Gujarat. pic.twitter.com/DmqisWWffn
— कर्व 卐 (@eternalroute) April 15, 2022
Also Read: