Delhi lockdown Liquor sales : దేశరాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇవాళ్టి రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైన్ షాపుల ముందు జనం బారులు తీరుతున్నారు. లిక్కర్ బాటిల్స్ పెద్ద ఎత్తున కొనుక్కుంటున్నారు. ఈ సందర్భంగా శివపురి గీతా కాలనీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లిక్కర్ కొంటున్న వారిలో ఓ మహిళ ఉండటంతో.. ఆమెను మీడియా కదిలించింది. ఆమె చెప్పిన మాటలు విని అక్కడున్న వారు షాక్ అయ్యారు. ‘‘ఇంజక్షన్‌తో ఉపయోగం లేదు.. ఆల్కహాల్ సర్వరోగ నివారిణి.. 35 ఏళ్ల నుంచి తాగుతున్నా.. ఈ ఇంగ్లీష్ మందులతో ఏం కాదమ్మా… ఒక్క పెగ్‌తో అన్నీ మాయం’’ అనిన ఆమెను చూసి అక్కడున్న వారు అవాక్కయ్యారు. ఇక, కరోనా లాక్ డౌన్ వేళ జనం వైన్ షాపుల ముందు పెద్దఎత్తున క్యూకట్టడం రాజధాని హస్తినలోని అనేక ప్రాంతాల్లో కనిపించింది. దాదాపు అన్ని షాపుల దగ్గర పెద్ద ఎత్తున లిక్కర్ కొనేందుకు కరోనాను పక్కనపెట్టి క్యూలు కట్టిమరీ ఎగబడ్డారు.
Read also : AP Corona : ఏపీలో మాస్క్ ధరించకపోతే జరిమానా, కోవిడ్ నియంత్రణ, నివారణపై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు