దొంగలు రోజురోజుకీ తెలివి మీరిపోతున్నారు. ఒకటికి రెండుసార్లు పక్కాగా రెక్కీ చేసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. చెన్నై శివారులోని నగల షోరూమ్‌లో జరిగిన ఘరానా చోరీ ఇప్పుడు అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. పక్కాగా సినిమా స్టైల్లో ప్లాన్ చేసిన దొంగల ముఠా.. రాత్రికి రాత్రి పథకాన్ని అమలు చేసింది. షోరూమ్‌లో నుంచి 10 కిలోల బంగారం, కోటి రూపాయల వజ్రాలు ఎత్తుకెళ్లిపోయారు.
చెన్నై శివారులోని పెరంబూరులో ఉంది ఈ జేఎల్ గోల్డ్ ప్యాలస్. ఈ షోరూమ్ పక్కనే ఓ ఆలయం ఉంది. దీన్ని ఉపయోగించుకుని ఆ గుడి వెనుక నుంచి షోరూమ్‌లోకి కన్నం వేశారు. తర్వాత మొత్తం ఊడ్చుకుని వెళ్లిపోయారు.
చెన్నైలోని పెరంబూర్‌లోని పేపర్‌మిల్స్ రోడ్డులో శ్రీధర్.. తన కుటుంబంతో కలిసి రెండస్థుల భవనంలో నివాసం ఉంటున్నాడు. ఫస్ట్ ఫ్లోర్ లో ఎనిమిది సంవత్సరాలుగా జేఎల్ గోల్డ్ ప్యాలెస్ పేరుతో బంగారు నగల దుకాణాన్ని నడుపుతున్నాడు. ఎప్పటిలాగే గురువారం రాత్రి నగల దుకాణాన్ని మూసివేశాడు. అయితే శుక్రవారం ఉదయం షాప్ తెరిచేందుకు శ్రీధర్ తన షాపునకు వచ్చి చూసేసరికి షాక్‌కు గురయ్యాడు.
దుకాణ షట్టర్‌ను గుర్తుతెలియని దుండగులు వెల్డింగు మిషన్‌తో కత్తిరించి దోపిడీ చేశారు. తొమ్మిది కిలోల బంగారం, రూ.20 లక్షలు విలువచేసే వజ్రాలు ఎత్తుకెళ్లారు. భవనంలోని సీసీటీవీ హార్డ్ డిస్క్‌ను కూడా తీసుకువెళ్లిపోయారు. ఈ ఘటనపై దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం