AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్లోబల్ ఎనర్జీ రంగంలో తెలుగు తేజం.. శ్వేతా రవి కుమార్‌కు అరుదైన గౌరవం!

హైదరాబాద్‌కు చెందిన యువతి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు. ఎనర్జీ నిపుణురాలు, ఎఫ్‌ఎస్‌ఆర్ గ్లోబల్ (FSR Global) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్వేతా రవి కుమార్ ప్రతిష్టాత్మక 'ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్ ఫెలో'గా ఎంపికయ్యారు. ఇంధన రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గాను ఎమినెన్స్ రూట్ ద్వారా ఆమె ఎన్నికయ్యారు.

గ్లోబల్ ఎనర్జీ రంగంలో తెలుగు తేజం.. శ్వేతా రవి కుమార్‌కు అరుదైన గౌరవం!
Swetha Ravi Kumar, Executive Director Of Fsr
Balaraju Goud
|

Updated on: May 10, 2026 | 4:40 PM

Share

హైదరాబాద్‌కు చెందిన యువతి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు. ఎనర్జీ నిపుణురాలు, ఎఫ్‌ఎస్‌ఆర్ గ్లోబల్ (FSR Global) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్వేతా రవి కుమార్ ప్రతిష్టాత్మక ‘ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్ ఫెలో’గా ఎంపికయ్యారు. ఇంధన రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గాను ఎమినెన్స్ రూట్ ద్వారా ఆమె ఎన్నికయ్యారు.

శ్వేతా రవి కుమార్ కేవలం ఎఫ్‌ఎస్‌ఆర్ గ్లోబల్ డైరెక్టర్ మాత్రమే కాదు, భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయిన ఇండియా ఎనర్జీ స్టాక్ (IES) ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా, నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యురాలుగా కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ గౌరవం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదని, ప్రపంచ ఇంధన చర్చల్లో మరింత చురుగ్గా పాల్గొనేందుకు లభించిన బాధ్యతగా భావిస్తున్నానని లింక్డ్‌ఇన్ వేదికగా పేర్కొన్నారు.

ప్రస్తుత తరుణంలో ఇంధన రంగం అర్టిఫిషియల్ ఇంటలిజన్స్ (AI), డిజిటలైజేషన్, వికేంద్రీకరణ వంటి సాంకేతిక మార్పులతో పునర్నిర్మించబడుతోందని శ్వేత అభిప్రాయపడ్డారు. “ఇంధన పరివర్తన అనేది కేవలం ఒక రంగానికి పరిమితం కాదు. విద్యుత్, గ్యాస్, రవాణా, డిజిటల్ మౌలిక సదుపాయాలు ఒకదానితో ఒకటి అనుసంధానించి ఉన్నాయి. ఈ వాస్తవికతకు అనుగుణంగా నియంత్రణ సంస్థలు అడుగులు వేయాలి.” అని శ్వేతా రవి కుమార్ అన్నారు.

ఇటలీలోని ఫ్లోరెన్స్ స్కూల్ ఆఫ్ రెగ్యులేషన్ సోదర సంస్థగా ప్రారంభమైన ఎఫ్ఎస్ఆర్ గ్లోబల్, ప్రస్తుతం భారతదేశం కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్వతంత్ర థింక్-ట్యాంక్‌గా ఎదిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భరత స్ఫూర్తితో, కన్సల్టింగ్, పాలసీ సలహా రంగాలలో భారత్ స్వయంసమృద్ధి సాధించే దిశగా ఈ సంస్థ కృషి చేస్తోంది. ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన పరివర్తన, మార్కెట్ రూపకల్పన, డేటా వ్యవస్థల బలోపేతంపై ఈ సంస్థ దృష్టి సారిస్తోంది. హైదరాబాద్ వాసిగా అంతర్జాతీయ వేదికపై శ్వేత సాధించిన ఈ విజయం, ఇంధన రంగంలో భారతదేశ విధాన రూపకల్పన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us