Uttar Pradesh: చిన్నారిపై లైంగిక దాడి.. తీవ్ర గాయాలతో సాయం కోరినా.. ఏ మాత్రం కనికరించకుండా..

అతనో సైకో. ఒంటరిగా ఉన్న చిన్నారులు కనిపిస్తే చాలు లైంగికంగా దాడి చేస్తాడు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా అసలే లేదు. కోరిక తీర్చుకోవడానికి దారుణానికి పాల్పడేందుకూ వెనకాడడు. ఇలా ఇద్దరు బాలురపై దాడి చేసి...

Uttar Pradesh: చిన్నారిపై లైంగిక దాడి.. తీవ్ర గాయాలతో సాయం కోరినా.. ఏ మాత్రం కనికరించకుండా..
Harassment
Follow us

|

Updated on: Oct 29, 2022 | 7:57 AM

అతనో సైకో. ఒంటరిగా ఉన్న చిన్నారులు కనిపిస్తే చాలు లైంగికంగా దాడి చేస్తాడు. అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా అసలే లేదు. కోరిక తీర్చుకోవడానికి దారుణానికి పాల్పడేందుకూ వెనకాడడు. ఇలా ఇద్దరు బాలురపై దాడి చేసి చంపేశాడు. ఈ కేసులో అరెస్టయి పోలీస్ స్టేషన్ కూ వెళ్లాడు. బెయిల్ పై విడుదలై బయటకు వచ్చాక కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మరోసారి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఆమె సహాయం కోసం అర్థిస్తుంటే.. ఏ మాత్రం కనికరం చూపకుండా సెల్ ఫోన్ తో వీడియో రికార్డు చేశాడు. ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్‌ జిల్లా ఖుదాగంజ్‌కు చెందిన రామ్‌జీ వర్మ ఓ సైకో. మైనర్లు కనిపిస్తే చాలూ.. అతనిలో ఉన్న మృగం నిద్ర లేస్తుంది. ఇలా గతంలో చాలాసార్లు పసిపిల్లలపై దాడులకు ప్రయత్నించాడు. అతనిపై ఇప్పటి వరకు అధికారికంగా మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. అందులో ఇద్దరు మైనర్‌ బాలుర్లను లైంగికంగా వేధించి చంపేసినట్లు కేసులు ఉన్నాయి. అనంతరం 2018 లో ఓ మైనర్‌ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో పోలీసులకు దొరికి అరెస్ట్‌ అయ్యాడు. అయితే కేవలం పదిహేడు రోజుల్లోనే ఈ మూడు ఘాతుకాలకు పాల్పడడం గమనార్హం.

ఏడాది తర్వాత బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. కన్నౌజ్ లోని గుర్సాహైగంజ్ ప్రాంతంలోని ప్రభుత్వ గెస్ట్ హౌజ్ కు సమీపంలో ఓ బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో ఆమెను కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక తనను కాపాడాలని కోరుకున్నా అతనిలో మార్పు రాలేదు. ఆమె అనుభవిస్తున్న వేదనను సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిన్నారికి చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక కాన్పూర్‌ రెజెన్సీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సీసీ ఫుటేజీ ద్వారా ఆమెపై దాడికి పాల్పడింది 22 ఏళ్ల వయసున్న రామ్‌జీ వర్మ గా పోలీసులు గుర్తించారు. అతనికి గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసుకుని స్టేషన్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి