
ఇంట్లోని వెస్టర్న్ టాయిలెట్ కమోడ్ పేలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. కొన్ని జాతీయ మీడియాల కథనాల ప్రకారం..సెక్టార్ 36లో నివసిస్తున్న అషు అనే 22 ఏళ్ల కుర్రాడు తన ఇంట్లో ఉన్న బాత్‌రూమ్‌లో టాయిలెట్‌కు వెళ్లాడు. అయితే బయటకు వచ్చేటప్పుడు అషు కమోడ్‌కు ఉన్న ఫ్లష్‌ను నొక్కాడు దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధంలో ఆ కమోడ్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అషు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన అషు తండ్రి అతన్ని వెంటనే గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS) కులోని హాస్పిటల్‌కు తరలించాడు. అషును పరీక్షించిన వైద్యులు అతనికి 35 శాతం కాలిన గాయాలు అయినట్లు నిర్ధారించారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో బాత్రూంలో ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ లేవని అషు తండ్రి తెలిపారు.అయితే పేలుడు ఎలా సంభవించిందో తెలియట్లేదని అతని చెప్పుకొచ్చారు. అయితే, ప్రాథమిక అంచనాల ప్రకారం కమోడ్‌లో మీథేన్ వాయువు పేరుకుపోవడం వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే డ్రైనెజీ ముసుకుపోవడం కారణంగా టాయిలెట్ కమోడ్‌లో గ్యాస్ వంటి వాయువులు పేరుకుపోయాయని.. ఫ్లస్ నొక్కినప్పుడు స్పార్క్ వంటిది ఏర్పడి పేలుడు సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది.
అయితే ఈ ఘటనపై స్పందించిన ఓ స్థానిక వ్యక్తి మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ ప్రాంతంలో కొంత కాలంగా డ్రైనేజీ సమస్య ఉన్నట్టు తెలిపాడు. ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ పైపులు చాలా పాతవని.. అంతే కాకుండా వాటిని సంవత్సరాలుగా శుభ్రం కూడా చేయలేదని ఆరోపించాడు. ఈ కారణంగానే పైపులలో గ్యాస్ పేరుకుపోయి పేలుడుకు దారి తీసి ఉండొచ్చని అతని తన అభిప్రాయాన్ని చెప్పాడు.
అయితే, గ్రేటర్ నోయిడా అథారిటీ సీనియర్ మేనేజర్ ఏపీ వర్మ మాత్రం ఆ వ్యక్తి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. తమ వ్యవస్థలు మంచి స్థితిలో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనెజీ వ్యవస్థ శుభ్రంగా ఉందని.. అంతే కాదు సాధారణంగా పనిచేస్తోంది అయన అన్నారు. ఈ ప్రమాదం ఇంటిట్లోని ఏదైనా అంతర్గత సమస్య వల్ల జరిగి ఉండొచ్చని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..